ఆడబిడ్డకు అందలం.. శభాష్ “నమస్తే”

పుట్టింది బాబా.. పాపా? అంటే.. బాబు అని చెబితే ఒక విధ‌మైన ఎక్స్‌ప్రెష‌న్‌, పాప అని చెబితే మ‌రొక ఎక్స్‌ప్రెష‌న్ చూపిస్తారు. ఆడ‌పిల్ల పురుడు పోసుకున్న రోజు నుంచే ఎన్నో వివ‌క్ష‌ల‌ను ఎదుర్కొంటున్న‌ది. తొలుత బాబే పుట్టాల‌ని అత్త‌, అమ్మ‌, అక్క చెల్లెళ్లు సైతం కోరుకుంటున్న ఈ రోజుల్లో పాప పుడితే క‌డుపునిండా సంబుర ప‌డేది కొద్ది మందే. ఇలాంటి వారు మాత్ర‌మే వారి ఆ సంతోషాన్ని అనుభ‌విస్తారు. గొప్ప‌గా జ‌రుపుకుంటారు. మ‌హ‌బూబాబాద్ కే స‌ముద్రం మండ‌లంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది. ఈ వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చురించిన తెలుగు ప‌త్రిక‌ల‌కు అభినంద‌న‌లు.

ఓపెన్‌గా మాట్లాడుకుంటే.. ఆడబిడ్డ పుడితే సంతోషించే కుటుంబాలు కొన్నేఉంటాయి. వారు మాత్ర‌మే ఇంటికి మహాలక్ష్మి వ‌చ్చింది అని సంబర పడుతుంటారు. ఇలాంటి వార్త ఈ రోజు తెలుగు పేప‌ర్ల‌లో ప్ర‌ముఖంగా ప్ర‌చురిత‌మ‌వ‌టం సంతోషించ‌ద‌గ్గ‌ విష‌యం. ఆంద్ర‌జ్యోతి, ఈనాడు స‌హా అన్ని ఇదే ఫాలో అయితే నమస్తే తెలంగాణ పత్రిక ఒక అడుగు ముందుకు వేసింది. మొద‌టి పేజీలో ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. ఒక పేద‌, వెనుక‌బ‌డ్డ మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం లో ఆడబిడ్డ పుట్టుక‌ను ఆ కుటుంబం గౌరవించిన తీరు ప్రశంసనీయం. బిడ్డ తో కలిసి ఇంటికి వచ్చిన కోడలిని పూ రెక్కలపై నడిపించి.. పాప‌ను పూల పాన్పుపై పడుకోబెట్టింది. ఈ అరుదైన సందర్భాన్ని నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీలో ” రావమ్మా మహాలక్ష్మి” శీర్షికన ప్రచురించింది. ఆ ఒక్క ఆడబిడ్డకే కాదు యావత్ మహిళాలోకానికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. అందుకే ఈ రోజుకి న‌మ‌స్తే తెలంగాణ‌కు శ‌భాష్ అనిపించుకున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *