నేటి కరెంట్ అఫైర్స్ 02-01-21

* రాష్ట్రీయం

– హైదరాబాదులోని NGRI శాస్త్రవేత్త తన్వి అరోరా “ఇంటర్నేషనల్ జియో సైన్స్ ప్రోగ్రాం (igcp)” సైంటిఫిక్ బోర్డుకు నామినేట్ అయ్యారు. ఈ బోర్డుకు హైదరాబాద్ నుంచి ఎంపికైన మొదటి శాస్త్రవేత్త ఆమె.
– తెలంగాణలో తొలిసారి వ్యాక్సిన్ dry run నిర్వహించిన జిల్లాలు.. హైదరాబాద్, మహబూబ్ నగర్. జనవరి 2న జరిగింది. అదే సమయంలో ఏపీలో అన్ని జిల్లాల్లో డ్రై రన్ జరిగింది.

* జాతీయం
– ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రా జనక సంస్థలు సంయుక్తంగా తయారుచేసిన కొవి ఫీల్డ్ ఇక అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (cdcso) ఆమోదం తెలిపింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి సిఫారసు చేసింది. డి సి జి ఐ ఆమోదిస్తే వ్యాక్సిన్ను దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తారు.
– డిసెంబర్లో దేశవ్యాప్తంగా రూ. 1,15,174 కోట్ల జిఎస్టి వసూలు నమోదయ్యాయి. 2017 జూలై 1న జిఎస్టి ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
– 2018 తో పోల్చితే గత ఏడాది దేశంలో వీఐపీల సంఖ్య తగ్గింది. 21,300 నుంచి 19,467కు తగ్గినట్టు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 2020 నివేదిక తెలిపింది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం విఐపీల సంఖ్య 487 నుంచి 799కి పెరిగింది.
– రాబోయే పదేళ్లలో పరిశోధనల్లో భారత్ సైంటిఫిక్ సూపర్ పవర్ దేశాల్లో టాప్-3 లోకి చేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైన్స్ పాలసీని తీసుకొచ్చింది.
– భారత ఆర్మీ లో మొదటిసారిగా మానవ హక్కుల విభాగం ఏర్పాటు అయింది. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన వివాదాలను ఇది పరిష్కరిస్తుంది. విభాగానికి మేజర్ జనరల్ గౌతమ్ చౌహాన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
– 2020లో పాకిస్తాన్ మొత్తం 5100 సార్లు భారత్ పై కాల్పులు జరిపిందని ఆర్మీ ప్రకటించింది.
– ఇండేన్ గ్యాస్ దేశంలోనే మొదటిసారిగా మిస్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

* అంతర్జాతీయం
– యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ పూర్తిగా బయటకు వచ్చింది. బ్రెగ్జిట్ పక్రియ 2020 డిసెంబర్ 31తో పూర్తయింది.

– ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ జాతీయ గీతంలో స్వల్ప మార్పులు చేసింది. “వుయ్ ఆర్ యంగ్ అండ్ ఫ్రీ” వాక్యంలో యంగ్ కు బదులుగా వన్ అనే పదాన్ని చేర్చింది.

* గోల్డెన్ పాయింట్స్
– సియాచిన్ హీరో, రిటైర్డ్ కల్నల్ నరేంద్ర కుమార్ జనవరి 1న అనారోగ్యంతో కన్నుమూశారు. భారత భూభాగం అయిన సియాచిన్ లో పాకిస్తాన్ సైనికులు తిరుగుతున్నారని ఆయన రూపొందించిన నివేదిక ఆధారంగానే 1984 లో భారత ప్రభుత్వం ఆపరేషన్ మేఘదూత్ చేపట్టింది. సియాచిన్ ను స్వాధీనం8 చేసుకుంది. నందాదేవి పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు రికార్డు ఆయన పేరు మీద ఉంది.

– భారత నౌకాదళం చేతికి మరో ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ రకం యుద్ధనౌక చేరింది. ఇది ఎనిమిదోది. ఇది ఉభయ చర నౌక. ఇది గస్తీ కాయడంతోపాటు ఆయుధ సామాగ్రిని యుద్ద ట్యాంకులను మోసుకెళ్లగలదు.
– జనవరి 1తో డిఆర్డిఓ కు 63 వసంతాలు పూర్తయ్యాయి. 1958లో దీనిని స్థాపించారు. డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి. ఈ సంవత్సరాన్ని ఎగుమతుల సంవత్సరంగా నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *