న్యూడ్ గా నిరసన..ఎక్కడంటే..

రైతుల నిరసన. ఉద్యోగస్తుల నిరసన ఇలా పలు రకాల నిరసనలు ఎన్నో..మరి వారికి మద్దతు తెలిపేవారు కూడా ఉంటారు కదా. ఎవరికి తోచినట్టు వారు మద్దతిస్తారు. అయితే ఇక్కడ ఓ నటి ఏకంగా బట్టలు విప్పి మరీ నిరసన తెలపడం వైరల్ అవుతోంది.   ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న ఇటువంటి వింత నిరసన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో 57 ఏళ్ల నటి కోరెన్ మాసిరో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి పేరుతో ప్రభుత్వం థియేటర్లను, సినిమాహాళ్లను మూసివేయించిందని ఆరోపిస్తూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవార్డుల ఫంక్షన్‌లో వేదిక మీద అందరిముందు తన దుస్తులను విప్పేసి, పూర్తి న్యూడ్‌గా మారిపోయారు. ఈ ఘటన ప్యారిస్‌లో నిర్వహించిన సీజర్ అవార్డుల ఫంక్షన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సీజర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న నటి కోరెన్ మాసిరో అందమైన క్యాస్టూమ్స్‌తో వేదికమీదకు వచ్చారు. దీంతో అందరి దృష్టి ఆమెపై పడింది. ఇంతలో ఉన్నట్టుండి ఆమె తన దుస్తులను విప్పేశారు. ఈ ఊహించని పరిణామానికి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. ఆమె తన శరీరంపై ప్రధాని జీన్ కాస్టెక్స్‌ను ఉద్దేశించి ఒక సందేశం రాశారు. ఆమె తన ఛెస్ట్ మీద ‘కల్చర్ లేకపోతే ఫ్యూచర్ లేదని‘, వీపు భాగంలో ‘మాకు మా కళను అప్పగించండి. బతికించండి’ అని రాసుకుని అందరిముందు ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *