యాక్.. వందల ప్రాణాలు కాపాడింది

కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారి ఒక‌వైపు ప్రాణాలు హ‌రించేందుకు ముందుకు వ‌స్తుంటే, లాక్‌డౌన్ ప‌రిస్థితులు మ‌రెంద‌రికో ప్రాణాల మీద‌కు నెట్టివేశాయి. ముఖ్యంగా ముస‌లివారు, దీర్ఘ‌కాలిక రోగుల వారికి ఎంతో క‌ష్ట‌మైన రోజుల‌వి. వారానికి, నెల‌కొక‌సారి మందులు కొనుగోలు చేస్తూ ప్రాణాలు కాపాడుకుంటున్న వారికి క‌రోనా భ‌యం చుక్కుల చూపింది. దీంతో ఎంతో మందికి వైర‌స్‌కు భ‌య‌ప‌డి మందులు కొనుగోలు చేయ‌లేక ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ (యాక్‌) అనే స్వ‌చ్చంధ సంస్థ ముందుకు వ‌చ్చింది. వైర‌స్ ఒక‌వైపు విస్త‌రిస్తున్న‌ప్ప‌టికీ తాము సైతం మీకు అండ‌గా ఉంటామంటూ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. మాకు ఫోన్ చేయండి. మీకు అవ‌స‌ర‌మైన మందులు మీ ఇంటికే తెచ్చి ఇస్తామ‌ని ఆ సంస్థ చేసిన ప్ర‌క‌ట‌న ఎంతో మంది ముస‌లివారికి, రోగుల‌కు సంజీవ‌నిగా మారింది. ఇలా మొద‌లు పెట్టిన ఈ ఇంటికి మందుల పంపిణీ కార్య‌క్ర‌మం వ‌ల్ల లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మందికి స‌కాలంలో మందులు అందాయి. ఆ సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు ప‌ల్నాటి రాజేంద‌ర్‌, స‌హా మ‌రో 20 మంది టీంగా ఏర్ప‌డి స్కూట‌ర్ల మీద నిరంత‌రం తిరుగుతూ అడిగిన వారికి మందులు పంపిణీ చేశారు. కేవ‌లం హైద‌రాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవ‌లు కొన‌సాగించారు. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాల‌కే కాకుండా వ‌‌రంగ‌ల్‌లోని మారుమూల ప్రాంతాల‌కు సైతం వెళ్లి మందులు అందించారు. ఇలా మొద‌లైన ఈ కార్య‌క్ర‌మానికి ఈ ఏప్రిల్ 3 నాటికి ఏడాది పూర్త‌యింది. ఇంత గొప్ప సేవ చేసిన ఆ సంస్థ‌కు, స‌భ్యుల‌కు, క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికి నిజంగా హ్యాట్స్ ఆఫ్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *