ఫిట్స్ వస్తే నురగ ఎందుకు వస్తుందో తెలుసా..

ఎన్నో రకాల వ్యాధులు ఒక్కో వ్యాధిది ఒక్కో లక్షణం. అయితే ఇదో డిఫరెంట్ జబ్బని చెప్పాలి ఫిట్స్ ని. ఎందుకంటే  ఫిట్స్‌ వచ్చినప్పుడు నోటి నుంచి నురుగ రావడాన్ని చూస్తుంటాం.నిజానికి చెప్పాలంటే   చూసేవారికిది చాలా భయాన్ని గొలుపుతుంది కూడా. ఇది చాలా నిరపాయకరమైన లక్షణం. ఫిట్స్‌ వచ్చినప్పుడు నురగ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఫిట్స్‌ వచ్చినప్పుడు మింగడం ప్రక్రియ ఆగిపోతుంది. కానీ నోట్లో ఊరే లాలాజలం మాత్రం యథావిధిగా ఊరుతూనే ఉంటుంది. సాధారణంగా నోట్లో ఊరే ఈ లాలాజలం నిత్యం గుటక వేయడం వల్ల కడుపులోకి వెళ్తుంది. మనకు తెలియకుండానే మనం ఇలా ఎప్పటికప్పుడు గుటక వేస్తూనే ఉంటాం.  అయితే ఫిట్స్‌ వచ్చినవారిలో గుటక వేయనందున ఆ లాలాజలం నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తుల్లోంచి వచ్చే గాలి ఈ లాలాజలంలో బుడగలను సృష్టిస్తుంది. అందుకే ఫిట్స్‌ వచ్చినప్పుడు ఈ బుడగలతో కూడిన లాలాజలం కారణంగా…  నోట్లోంచి నురగ వస్తున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ముందు చెప్పినట్లుగా ఇదేమీ ప్రమాదకరమైన లక్షణం కాదు. అంతేకాదు… దీన్ని ఫిట్స్‌ తీవ్రతకు లక్షణంగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఆ నురగను చూసి ఆందోళన చెందకుండా  రోగిని సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి చేర్చాలి. అదీ విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *