జర్నీలో వాంతులు..ఎందుకవుతాయో తెలుసా..

కొంతమందికి ప్రయాణం అంటే చాలా భయం..ఎందుకంటే వారికి ప్రయాణంలో వాంతులు అవుతుండటం వల్ల ప్రయాణం చేసేందుకు ఇష్టపడరు. అసలు   ప్రయాణంలో వాంతులు ఎందుకవుతాయి. దీనిని  వైద్య పరిభాషలో ‘మోషన్ సిక్ నెస్’ (Motion Sickness) అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు.కొందరిలో ప్రయాణం మొదలుకాగానే ప్రభావం కనిపిస్తుంది. మరి కొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత, ఎగుడుదిగుడు రోడ్లు, ఘాట్ రోడ్డు ప్రయాణం, వాహనంలో వాసనలు వలన కూడా వాంతులు వస్తాయని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు.మోషన్ సిక్‌నెస్ ప్రధానంగా 2 నుంచి 12 ఏళ్లలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరితో పోల్చుకుంటే మగవాళ్లలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. మగవాళ్లలో కంటే పిల్లలు, ఆడవాళ్లలో సెన్సిటివ్‌ నెస్‌ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అట. జన్యుపరంగా కూడా ఇది వస్తుంటుంది. ఇంకా ఆడవాళ్లలో నెలసరి సమయంలో, గర్భవతులకు, మైగ్రేన్, పార్కిన్‌సన్ వ్యాధి ఉన్నవాళ్లకు ప్రయాణంలో వాంతులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ” అట..బస్సుల్లో ప్రయాణంలోనే కాదు…ఎలాంటి ప్రయాణంలో ఉన్నా కూడా ఈ వాంతులయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ మోషన్ సిక్‌నెస్‌కు కార్‌ సిక్‌నెస్‌, సీ సిక్‌నెస్‌, ఎయిర్ సిక్‌నెస్‌ ఇలా రకరకాలైన పేర్లు ఉన్నాయి. కొందరికి టూ వీలర్ మీద వెళ్లినప్పుడు కూడా వాంతులువుతాయి. ప్రయాణాల్లోనే తలతిరగడం, వాంతులకు కారణం చెవిలో ఉండే ‘లాబ్రింథైస్‘ (labyrinths) అనే భాగమే. ఇది పరిశుభ్రంగా లేకపోయినా, ఇది ఉన్న పరిస్థితిలో చిన్న మార్పు కలిగినా ప్రయాణంలో వాంతులు అవుతాయి.రోజూ స్నానం చేయకపోవడం, సబ్బుతో ముఖం కడుకున్నప్పుడు చెవుల్లో నురగను శుభ్రపరచకపోవడం, నూనె వేయడం, చీము, ఏదైనా వస్తువుతో చెవులలో పదేపదే తిప్పడం వలన కూడా లాబ్రింథైస్ వద్ద సమతాస్థితి దెబ్బతింటుంది. ఇధి మోషన్ సిక్‌నెస్‌కు కారణమవుతుంది. ఇది ప్రాణాలు తీసేసే వ్యాధి కాదు. అలాగే వాంతి కావడం చాలా సాధారణమని అనుకుంటారు. కానీ అదొక అనారోగ్యమేనని గుర్తించరు. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. అవి శాస్త్రపరంగా రుజువు కాకపోయినా పూర్వీకుల నుంచి ఇవి పాటిస్తున్నవే. ఫలితాలు ఇస్తున్నవే. ప్రయాణంలో ఉండగా వాంతులవుతున్నట్లు అనిపిస్తే…కుడి/ఎడమ చేతి బొటన వేలు కింద చివర భాగం, మణికట్లు కలిసే చోట ఎడమ/కుడి చేతితో నొక్కిపట్టుకోవడం లేదా మెల్లగా నొక్కడం వల్ల ఉపశమనం ఉంటుంది.ఇక శాశ్వతంగా ఈ సమస్య పరిష్కరానికి మందులున్నాయి. వాటిని కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా వినియోగిస్తే తగ్గిపోతుంది. మోషన్ సిక్‌నెస్‌ ఉన్నవాళ్లు వాహనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో కూర్చోకూడదు. అలాగే ప్రయాణంలో చదవకూడదు. అన్నింటి కంటే ముందు ప్రయాణం సందర్భంగా వాంతులు అనే అంశాన్ని మన మెదడులోకి రాకుండా చూసుకోవడం కూడా మంచిదంటున్నారు నిపుణులు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *