వర్క్ వుట్స్ వల్ల లాభాలు..

కొందరు నిత్యం ఫిట్ గా కనిపించేందుకు వర్క్ వుట్స్ ని తెగ చేస్తుంటారు. అయితే  యంగ్ ఏజ్ లో  ‌ చేసే వ్యాయామం మీ వ‌య‌స్సు 40 ఏళ్లు దాటిన త‌ర్వాత అది మిమ్మ‌ల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. యుక్త వ‌య‌స్సులో రోజువారీ వ్యాయామ దిన‌చ‌ర్య‌ను పాటించ‌డం ద్వారా త‌ర్వాతి కాలంలో అధిక ర‌క్త‌పోటు, చిత్త చాప‌ల్యం త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంద‌ని ఓ అధ్య‌యనంలో తేలింది. యుక్తవయస్సులో వారానికి కనీసం ఐదు గంటలు వ్యాయామం చేసిన వారు అంత‌కంటే తక్కువ వ్యాయామం చేసేవారితో పోల్చితే 18 శాతం త‌క్కువ ర‌క్త‌పోటుకు గురైతున్న‌ట్లు అధ్య‌య‌నం పేర్కొంది. అంతేకాకుండా వ్యాయామ దిన‌చ‌ర్య‌ను 60 ఏళ్ల వ‌ర‌కు కొన‌సాగించే అల‌వాటు ఉన్న‌వాళ్లు వీటి భారిన ప‌డే సంభావ్య‌త చాలా త‌క్కువని తెలిపింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్ర‌కారం.. పెద్దలు ప్రతి వారం కనీసం రెండున్నర గంటలపాటు మితమైన వ్యాయామం కలిగి ఉండాలని సూచిస్తున్నాయి. కాగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నేతృత్వంలోని అధ్యయన బృందం, శాన్ ఫ్రాన్సిస్కో (యుసిఎస్ఎఫ్) వారంలో ఐదు గంట‌ల‌పాటు వ్యాయామం చేయ‌డం శ్రేయ‌స్క‌ర‌మంది. దీని ద్వారా మిడ్ లైఫ్‌లో రక్తపోటు నుంచి ర‌క్షించుకోవ‌చ్చంది. ముఖ్యంగా ఇది ముప్పై, నలభై, యాభైలలో కొనసాగితే మంచిదని తెలిపింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనంలో పరిశోధకులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల సుమారు 5 వేల మందిని అనుస‌రించి ప‌రీక్షించారు. వీరి వ్యాయామ అలవాట్లు, వైద్య చరిత్ర, ధూమపాన స్థితి, మద్యపానం గురించి అడిగి తెలుసుకున్నారు. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లతో కలిసి రక్తపోటు, బరువును పరిశీలించారు. వ్యాయామం రక్తపోటును తగ్గిస్తుందని తేలింది. మధ్య వయసుకు వచ్చేసరికి పెద్దలందరిలో రక్తపోటును తగ్గించే మార్గంగా వ్యాయామంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని అధ్య‌య‌నం సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *