ఇకపై రెండు మాస్కులు.. ఎందుకంటే?

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మనిషి జీవితంలో మాస్క్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు కూడా మాస్క్ ధరించే వారు.. కానీ అది కేవలం దుమ్ము ధూళి నుంచి రక్షించుకోవడానికి మాత్రమే. నేటి రోజుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి ధరిస్తున్నారు. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పాకిపోయిందో భూమండల మంతా మాస్క్ ముసుగు లోకి వెళ్ళిపోయింది.
ప్రస్తుతం భారతదేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీచేశాయి. ప్రభుత్వాలు విధించిన నిబంధనను ఉల్లంగిస్తూ మాస్క్ ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ప్రస్తుతం అందరికీ వైరస్ పై అవగాహన రావడంతో ఇక బాధ్యతాయుతంగా మాస్క్ ధరించి వైరస్ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు మాత్రం మాస్క్ ధరించి ఉన్నప్పటికీ కూడా కరోనా సోకుతున్నది.
ఇటీవలే ఓ అధ్యయనంలో మాస్క్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు పరిశోధకులు. ఒక మాస్క్ ధరించడం కంటే రెండు మాస్కులు ధరించడం వల్ల వైరస్ ను ఎంతో సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు అంటూ వర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. డబుల్ మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాధి కణాలు ముక్కు నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించ లేవు అంటూ చెప్పుకొచ్చారు. వస్త్రం తో చేసిన మాస్కుల కంటే సర్జికల్ మాస్కులు ఎంతో మేలు అంటూ సూచించారు. ధరించిన మాస్కులు ముఖానికి బిగుతుగా ఉండాలి అంటూ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *