ట్యాన్ ని తొలగించండిలా..

వేసవిలో ఎండవల్ల ట్యాన్ బారిన పడుతుంటారు అంతా..మరి  ఈ ట్యాన్ ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం.  పెరుగుకు చర్మాన్ని చల్లబరచడమే కాకుండా ట్యాన్‌ను తొలగించే గుణమూ ఉంది. కొద్దిగా పెరుగు తీసుకొని ట్యాన్‌ ఉన్న భాగాల్లో రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
ముఖంపై టమాటా రసాన్ని రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. టమాటాను ముక్కలుగా చేసి నల్లబడిన చోట మసాజ్‌ చేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. టమాటా రసంలో కొంచెం పసుపు, శనగపిండి కలిపి రాసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ట్యాన్‌ తగ్గి చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.కలబంద శరీరంలోని మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పిగ్మంటేషన్‌ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే దీన్ని రెగ్యులర్‌గా ముఖానికి రాసుకుంటూ ఉండడం వల్ల చర్మం డీట్యాన్‌ అయ్యి మెరిసిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *