అద్దె ఇల్లు వద్దు.. సొంతిల్లే ముద్దు

కరోనా వేళ భారీగా పెరిగిన ఇళ్ల అమ్మకాలు

అద్దె ఇంట్లో ఉండలేక.. సొంతిల్లో కొనుగోలుకు మొగ్గు

కరోనా దెబ్బకు చాలా మంది సొంత ఇంటి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి. వైరస్ వ్యాప్తి సమయంలో అద్దె ఇండ్లలో ఇబ్బంది పడ్డారు. చాలా మంది ఇండ్లకే పరిమితం కావడంతో ఇరుకు గదుల్లో ఉండి ఆఫీసు పనులు చేసుకోలేకపోయారు. దీంతో కరోనాకు ముందు సొంత ఇళ్లను కొనుగోలు చేసే సాహసం చేయనివారు సైతం ఈ మహమ్మారి దెబ్బకు మునుపెన్నడూ లేనంతగా సొంత ఇంటి కొనుగోలువైపు మొగ్గుచూపుతున్నారు. అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్న చాలామంది సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరోక్ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ఆధారంగా.. 2018 కంటే 2019 మొదటి మూడు త్రైమాసికాలలో దేశంలోని 7 నగరాల్లో దాదాపు 2.02 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్మకాలు జరిగాయి. దీంతో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. 2016 లో ఇది 2.07 లక్షల యూనిట్లుగా ఉన్నదని నివేదికలో పేర్కొన్నది.

కరోనా కారణంగా అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నా.. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం నెలల్లోనే పుంజుకున్నదని, మొదటి అన్ లాక్ చేసిన కొద్ది నెలల్లోనే అమ్మకాలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. మహమ్మారి విజృంభించినా 2020 సెప్టెంబర్ లో భారత గృహనిర్మాణ రంగం 65% నుంచి 79% పుంజుకున్నది.

కరోనా కారణంగా అద్దె ఇంట్లో నివసించేవారు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారని, దీంతో అద్దె ఇల్లు కంటే.. సొంత ఇల్లే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు అనరోక్ నివేదికలో తేల్చింది. మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా పెద్ద ఇళ్లకు, 3 బీహెచ్ కే ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా వల్ల ఎక్కువ మందికి ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఆఫీస్ వర్క్‌, లేదంటే కుటుంబసభ్యులతో గడపడం, వ్యాయామాలు ఇలా ఇతరాత్ర కారణాల వల్ల పెద్ద ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మరో ప్రాపర్టీ సంస్థ ప్రాప్‌టైగర్ డాటా ల్యాబ్స్ ప్రకారం.. 2020 మొదటి త్రైమాసికంలో 3 బీహెచ్ కే క్యాటగిరీలోని 15,998 యూనిట్లు అమ్ముడు కాగా, 2021 మొదటి త్రైమాసికంలో ఆ సంఖ్య కాస్త పెరిగి 17,200 యూనిట్లకు అమ్ముడైనట్లు ప్రాప్ టైగర్ డాటా ల్యాబ్స్ నివేదికలో తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *