టీ20ల్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్.. కోచ్ షేన్ బాండ్..
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బౌలర్ అని ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ కితాబిచ్చాడు. ఐపీఎల్ లో అతని ఆటను చూడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు కితిబిచ్చాడు.. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన క్వాలిఫయర్స్–1లో ముంబై ఇండియన్స్ ఘన విజయంలో అతనిదే కీలకపాత్రన్నాడు.. ట్రెంట్ బౌల్ట్ (2/9)తో కలిసి బుమ్రా (4/14) విధ్వంసం సృష్టించిన విషయాన్ని గుర్తు చేశారు.. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా బాండ్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘బుమ్రా ప్రపంచ అత్యుత్తమ టి20 బౌలర్. 2012 నుంచి స్టార్ పేసర్ బౌల్ట్ ఆటనూ ఆస్వాదిస్తున్నా. అతనో విధ్వంసక బౌలర్. ఐపీఎల్ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు’ అని ప్రశంసల వర్షం కురిపించాడు..