ఫిట్ గా ఉంటే ఏ వైరస్ దరిచేరదు..

ఫిట్ నెస్ కి మారు పేరు ఈ నటుడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత న‌టుడు, మోడ‌ల్ అయిన‌ మిలింద్ సోమన్ తొలిసారి 10 కిలోమీటర్లు పరిగెత్తారు. నిత్యం అర్ధ‌గంట‌కు త‌క్కువ కాకుండా వ్యాయామం చేయ‌డం అల‌వాటు చేసుకోవాలని ఆయ‌న అభిమానుల‌కు సూచించారు. సూర్యోద‌యం క‌న్నా ముందే లేచి ర‌న్నింగ్ చేయ‌డం చాలా మంచిద‌ని ఆయ‌న చెప్పారు. రోజూ 5-6 కి.మీ. ర‌న్నింగ్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే, పూర్తి రన్నింగ్ షెడ్యూల్‌ను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు. తొలిసారి 62 నిమిషాల్లో 10 కిలోమీటర్లు పరిగెత్తాన‌ని వెల్ల‌డించాడు. ఈ స‌మ‌యంలో హృదయ స్పందన 142 గా ఉన్న‌ద‌ని తెలిపారు.మిలింద్ ఇచ్చిన పోస్ట్‌లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీటిని మిలింద్ ఫిట్‌నెస్ మంత్రంగా చూసి పాటించాల‌ని కోరారు.రన్నింగ్ కోసం ఐదు వేళ్ల వైబ్రామ్ ధరించాలి. ఇది బొటనవేలికి క్లిప్ చేయబడి ఉంటుంది. లేదంటే లూనా చెప్పులు వేసుకోవాలి.మృదువు, కఠినమైన ఉపరితలాలు అనే పట్టింపు ఉండ‌కూడ‌దు. సజావుగా నడవ‌డం ముఖ్యం.క్రమం తప్పకుండా స‌జావుగా న‌డ‌వ‌డం అల‌వ‌ర్చుకోవాలి. ఇది కాళ్ళను బలపరుస్తుంది. పరిగెత్తడం మోకాళ్ళకు మంచిది.వ్యాయామానికి కొత్త వ్య‌క్తులు, అధిక బ‌రువు గ‌ల వారు, అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు త‌క్కువ దూరంతో ర‌న్నింగ్ ప్రారంభించాలి. క్ర‌మంగా దూరం పెంచుతూ పోవాలి.నిత్యం 5-6 కిలోమీటర్లు పరిగెత్తుతున్నట్లయితే ప్రత్యేక ఆహారం అవసరం లేదు. ఇందుకు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవ‌డం ముఖ్యం.ఉద‌యాన్నే సూర్య‌కిర‌ణాలు మ‌న శ‌రీరంపై ప‌డేలా ర‌న్నింగ్ కానీ, వాకింగ్ కానీ ఉండాలి. దీంతో మ‌న‌కు విట‌మిన్ డీ కూడా అందుతుంది. ఎండ ఎక్కువ‌గా ఉంటే స‌న్‌స్క్రీన్‌కు బ‌దులుగా ముఖానికి పెరుగు రాసుకుంటే స‌రిపోతుంది.బ‌య‌ట‌కు వెళ్లి వ్యాయామం చేయ‌డానికి ఇబ్బందిగా ఉంటే.. ఇంటి దాబాకు మించింది ఇంకోటి ఉండ‌దు.ఎవ‌రైనా ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌వుతారు. అయితే మీరు ఫిట్‌నెస్‌గా ఉంటే ఏ వైర‌స్ మిమ్మ‌ల్ని ఏమీ చేయ‌ద‌ని గుర్తుంచుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *