బాలీవుడ్ స్టార్ హీరోకి కరోనా..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ ద్వారా నిర్ధారణ చేశారు. కోవిడ్ 19 టెస్ట్‌లో నాకు పాజిటివ్ అని తెలిసింది. ప్రొటోకాల్‌ను పాటిస్తూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండటానికి నిర్ణయించుకున్నాను. హోం క్వారంటైన్లో ఉంటూ తగు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటాను. నన్ను ఈ మధ్య కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. త్వరలోనే మీ ముందుకొస్తానని ట్వీట్ చేశారు. కోవిడ్ లాక్డౌన్ నియమ నిబంధనలు సడలించి షూటింగ్స్‌కు పరిమితులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాల షూటింగ్స్‌లో నటిస్తూ వస్తున్నారు. రీసెంట్గా అక్షయ్ ‘రామ్ సేతు’ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్షయ్ కమిట్ అయిన సినిమాలన్నీ కొన్నాళ్లు పాటు రీ షెడ్యూల్ చేసుకోవాల్సిందే.