‘రామ్ చరణ్’ బర్త్ డే..’ఆచార్య’ లుక్ అదుర్స్
సిద్ధతో ఆచార్య లుక్ అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్-మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్ – నిరంజన్ రెడ్డి కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా మార్చి 27 (శనివారం) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ సినిమా నుంచి చరణ్ పోషిస్తున్న ‘సిద్ద’ లుక్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. చరణ్ బర్త్ డే పోస్టర్‌గా రిలీజ్ చేసిన ఈ లేటెస్ట్ లుక్‌లో ‘సిద్ద’ ‘ఆచార్య’తో కలిసి ఉండగా మెగా అభిమానుల్లో..సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేదిగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్‌కి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా భారీ స్థాయిలో మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్ర మెగాస్టార్‌తో కలిసి స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది.