రిపబ్లిక్ టీజర్..

ఆసక్తి రేపుతోంది రిపబ్లిక్ టీజర్.  యంగ్ హీరో  సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ‘రిపబ్లిక్’ సినిమా రూపొందుతోంది. దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటిస్తుండగా, రమ్యకృష్ణ  కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. “ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కో .. అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం ..” అంటూ సాయిధరమ్ తేజ్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. రాజకీయాలు .. అధికారదాహం .. వర్గపోరాటాలు .. ప్రజల మధ్య గొడవలు తదితర సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. సాయిధరమ్ తేజ్ .. రమ్యకృష్ణ పాత్రలను ఆవిష్కరించడమే ప్రధానంగా ఈ టీజర్ సాగింది. రమ్యకృష్ణ లుక్ డీసెంట్ గా ఉంది. అలాగే సాయిధరమ్ తేజ్ కూడా లుక్ పరంగా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. జూన్ 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. భగవాన్ – పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. సుబ్బరాజు .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ఏ స్థాయి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *