సీసీసీ ద్వారా కోవిడ్ టీకా..చిరంజీవి

కరోనా కష్టకాలంలో సినీ పరిశ్రమకి చెందిన వారిని సిసిసి రూపంలో ఆదుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు మరోసారి సీసీసీ సాయం అందనుంది.సినీ కార్మికుల‌కు సీసీసీ ద్వారా ఉచితంగా కోవిడ్ టీకా అందించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అక్కినేని నాగార్జున న‌టించిన వైల్డ్‌డాగ్ చిత్ర విశేషాల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చిరంజీవి అంద‌రితో పంచుకున్నారు. ఓ గెస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి. ఈ సినిమా గురించి అంద‌రికీ చెప్పాల‌నడం మొద‌టిసారేమో అని అన్నారు చిరు.సినిమాలో ప్ర‌తీ స‌న్నివేశం ఉత్కంఠ‌ను క‌లిగించింద‌ని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్ర‌తీ ఒక్క‌రు చూడాల‌ని చిరంజీవి సూచించారు. వైల్డ్‌డాగ్ చిత్రాన్ని అద్బుతంగా తీసిన డైరెక్ట‌ర్ అహిషోర్ సోలోమ‌న్ తోపాటు నిర్మాత నిరంజ‌న్ రెడ్డిని ప్ర‌శంసించారు. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు మ‌రిన్ని రావాల‌ని చిరంజీవి ఆకాంక్షించారు.సీసీసీలో కొంత మొత్తం మిగిలి ఉంది. ఆ మొత్తంతో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుంద‌నుకుంటున్నాం. క‌రోనా టైంలో కార్మికుల కుటుంబాల‌కు వ్యాక్సిన్ ఇస్తే..వారికి ఆరోగ్యాన్నిచ్చిన వాళ్ల‌మ‌వుతామ‌ని చిరంజీవి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *