కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొనవచ్చా..
ఈ కరోనా కష్టకాలంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. కానీ వారి అంత్యక్రియలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా పుణ్యమా అని అయినవాళ్లు కూడా కానివాళ్లు అయిపోతున్నరు.. ఎంతటి ఆత్మీయులు దూరమైనా సరే చివరిచూపు కోసం వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నారు. వైరస్‌తో సచ్చిపోతే కనీసం పాడె మోసేందుకు కూడా నలుగురు ముందుకు రాలేని దుస్థితి వచ్చింది ..కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా.. లేదా.. అని జనాలు భయపడుతున్న ఈ సమయంలో ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా కీలక విషయాన్ని వెల్లడించారు. మరణించిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12 నుంచి 24 గంటలకు మించి కరోనా వైరస్ బతకలేదని స్పష్టం చేశారు. నిరభ్యంతరంగా అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తెలిపారు.కరోనాతో మరణించిన వారి 100కు పైగా మృతదేహాలను పరీక్షించాం. వైరస్ బారిన పడి మరణించిన ఒక్కో వ్యక్తి మృతదేహానికి 12, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాం. అప్పుడు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత 12 నుంచి 24 గంటల తర్వాత ఆ వ్యక్తి మృతదేహం నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. కాకపోతే మృతదేహం ముక్కు రంధ్రాలు, నోరు, మూసేయడం, బతికి ఉన్నప్పుడు రోగికి అమర్చిన వివిధ పైపులను తీసి శానిటైజ్ చేయడం మంచిది. అని డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు.కరోనాతో చనిపోయిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. కాకపోతే ముందు జాగ్రత్తగా మాస్కులు, గ్లౌసులు, పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియల్లో పాల్గొనడం మంచిది. దహన సంస్కారాల అనంతరం ఎముకలు, చితాభస్మం కూడా నిరభ్యంతరంగా సేకరించవచ్చు. అస్థికల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే లేదు. అది పూర్తిగా సురక్షితం అని డాక్టర్ సుధీర్ గుప్తా పేర్కొన్నారు. కరోనాతో మరణించిన వ్యక్తులకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు జరిపించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ అధ్యయనం చేసినట్లు స్పష్టం చేశారు.