మా కాలనీ పార్కులను కాపాడండి

బోడుప్పల్  శ్రీ మహాలక్ష్మీ నగర్ కాలనీవాసుల డిమాండ్

 

బోడుప్పల్ లోని శ్రీ మహాలక్ష్మీ నగర్ కాలనీలోబోడుప్పల్ లోని శ్రీ మహాలక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న పార్కును కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. 330 చదరపు గజాల పార్కుస్థలాన్ని కొందరు తప్పుడు సర్వే నంబర్లు, తప్పుడు ఫ్లాట్ నెంబర్లతో మాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలాలను కాపాడాలంటూ కాలనీ వాసులు పోచమ్మ ఆలయం వద్ద సమావేశం నిర్వహించారు. అనంతరం వారు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. పార్కుస్థలం కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి నగర్ కాలనీ అధ్యక్షులు కే రాజ్ కుమార్ మాట్లాడుతూ కాలనీ మొత్తం సర్వే నెంబర్ 65 లో ఉన్నదని చెప్పారు. అయితే కొందరు రాజకీయ నాయకులు, కబ్జాదారులు కలిసి కాలనీలో ఉన్న పార్కులకు 65 సర్వే నంబర్ కు బదులు 65/AA సర్వే నంబర్,  బై నెంబర్లతో అక్రమంగా పట్టా చేసి అమ్ముకున్నారనిి ఆరోపించారు.  ఇటీవల కాలనీ వాసులు కలసికట్టుగా పోరాడి కొన్నిటిని తిరిగి స్వాధీనం చేసుకున్నామన్నారు.  ఇంకాా కొన్ని  స్థలాల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు కట్టారని ఆరోపించారు. అధికారులు వెంటనే ఈ అక్రమ కట్టడాలను పరిశీలించి చర్యలుతీసుకోవాలని, అదేవిధంగా అక్కడి ప్రభుత్వ పార్కు జాగను స్వాధీనం చేసుకుని కంపౌండ్ వాల్స్ తో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

-పార్కు ఆక్రమణ ఆరోపణలపై కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ను వివరణ కోరాగా..338 చదరపు గజాల పార్కు లేదా ప్లాట్ కు ఎలాంటి పర్మిషన్ లేదని,అక్కడ ఎలాంటి కట్టడాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎక్కడ కూడా ప్రభుత్వ పార్కులను అక్రమించడానికి ప్రయత్నించినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *