సెకన్లలో కుప్పకూలిన మూడంస్తుల భవనం..
సెకన్ల సమయంలో కుప్పకూలిపోయిందట మూడు అంతస్థుల భవనం. ఎక్కడో తెలుసా థాయ్‌ల్యాండ్‌లో. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది భవనం లోపలకు వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో గోడలు మొత్తం బలహీనంగా ఉండటాన్ని గుర్తించారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి అగ్నిమాపక సిబ్బంది బయటకు వెళ్లే సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ కారణంగా భవనంలో నివసించే ఒక వ్యక్తి, నలుగురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.