స్పేస్ టూర్ లో తెలుగు యువతి..

కలలుకంటాం కానీ వాటిని సహకారం చేసుకోవాలంటే ఎన్నో ముప్ప తిప్పలు పడాల్సిందే. కాగా ‘స్పేస్ టూర్..’ ఇది ఎంతో మందికి స్వప్నం. కల్పనా చావ్లా వంటి అతి కొద్ది మంది భారతీయులకు మాత్రమే ఈ అరుదైన అవకాశం దక్కింది. అయితే.. తాజాగా ఓ తెలుగు యువతికి సైతం ఈ ఛాన్స్ దక్కింది. జూలై 11న అమెరికాకు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అనే సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించబోతోంది. మొత్తం నలుగురు ప్రయాణికులు వెళ్లే ఈ స్పేష్ షిప్లో.. భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె.. ఈ స్పేస్ టూర్ చేయబోతున్నారు.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకే వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ టూర్ ప్లాన్ చేసింది. స్పేస్ లోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఈ కంపెనీ లైసెన్స్ కూడా తీసుకుంది. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీకి జూన్ 25వ తేదీనే.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అనుమతి మంజూరు చేశారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే.. ప్రయాణికులను తీసుకెళ్లడం మాత్రం ఇదే తొలిసారి.ఈ టీమ్ లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలెట్లు కాగా.. మరో ముగ్గురు స్పేస్ సెషలిస్టులు. మిగిలిన ఒకరు బిలియనీర్. ఈ ఆరుగురు ఎవరంటే.. శిరీష బండ్ల కెల్లి ల్యాటిమర్ స్టర్ కోవ్ డేవ్ మెక్ కే మైఖేల్ మసూక్కీ బ్రాస్నన్. వీరిలో బ్రాస్నన్ సంపన్నుడి హోదాలో నింగిలోకి ఎగరబోతున్నారు. ఈ యాత్ర పూర్తయితే.. తొలిసారి స్పేస్ లోకి వెళ్లివచ్చిన ప్రైవేటు వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు.ఈ టీమ్ లో ఉన్న శిరీష బండ్ల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి. ఆమె కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించే విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ విధంగా ఈ స్పేస్ టూర్ కు వెళ్లే అవకాశం దక్కింది.కాగా.. అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ కూడా స్పేస్ టూర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 20వ తేదీన ఆయన స్పేస్ షిప్ బయలు దేరనుంది. కానీ.. ఆయనకన్నా ముందే.. వెళ్లిరావాలని నిర్ణయించుకున్న బిలియనీర్ రిచర్డ్ బ్రాస్నన్.. ఈ ప్రాజెక్టును చేపట్టారు. అంతరిక్షంలోకి వెళ్లిరావడం తన తల్లి కల అని చెప్పిన ఆయన.. త్వరలోనే దాన్ని సాధ్యం చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *