ఆక్సిజన్ పెంచుకునేందుకు ఈ ఫుడ్
ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత ఉంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ ఆక్సిజన్ ని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్‌డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని వస్తుంది. ఈ ఆక్సిజన్ కణాల్లో శక్తిని తయారుచేసేందుకు తోడ్పడుతుంది. అందుకే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్‌ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్లు, మహిళలకు 12 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్ హెల్త్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత పాళ్లలో మెయింటెయిన్ చేయాలంటే కాపర్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బీ2 (రైబోఫ్లెవిన్), విటమిన్ బీ3 (నియాసిన్), విటమిన్ బీ5, విటమిన్ బీ 6, ఫాలిక్ యాసిడ్, విటమిన్ బీ12 తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో ఈ న్యూట్రియెంట్స్ ఉండటం వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. సుమారు 90 గ్రాముల రాగుల్లో 245% కాపర్ లభ్యమవుతుంది. ఇది మనిషికి ఒక రోజుకు సరిపోతుంది.సుమారు 90 గ్రాముల పీతల్లో మనిషి రోజువారీ అవసరాలకు సరిపోయే కాపర్‌లో 30% లభిస్తుంది. చాక్లెట్, ఆలుగడ్డ, నువ్వులు, జీడిపప్పు, శితాకే మష్రూమ్ తదితరాల్లో కూడా తగినంతగా కాపర్ పొందవచ్చు. 30గ్రాముల చాక్లెట్ తీసుకుంటే 45% వరకు కాపర్ లభిస్తుంది.విటమిన్ బీ6, బీ9 ఆర్గాన్ మీట్ (లివర్), కోడిమాంసం, టూనా చేప తదితరాలతోపాటు అరటిపండు, పాలకూర, బ్రసెల్స్ మొలకల్లో పుష్కలంగా లభిస్తాయి. సహజంగా శాకాహారంలో విటమిన్ బీ12 లభించదు. కానీ.. బ్లాక్ ట్రంపెట్, గోల్డ్ శాన్ట్రెల్ అనే పుట్టగొడుగులో లభిస్తుంది. సముద్ర కూరగాయలైన గ్రీన్ లావెర్, పర్పల్ లావెర్లోనూ లభిస్తుంది.కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్ (కిడ్నీ, లివర్), పాలు తదితరాల్లో అధిక పాళ్లలో ఉంటుంది. 90 గ్రాముల లివర్ తీసుకుంటే రోజుకు కావాల్సిన రైబోఫ్లెవిన్లో 223% పొందవచ్చు.ఓట్స్, పెరుగు, పాలు, బాదాం, పనీర్, పొట్టుతో కూడిన యాపిల్, బీన్స్, సన్‌ఫ్లవర్ గింజలు, టమాట తదితరాలు తీసుకున్నా రైబోఫ్లెవిన్ లభిస్తుంది.