ఆరోగ్యానికి నల్ల బియ్యం..
ప్రస్తుతం ముడి బియ్యం..రాగులు..కొర్రలు లాంటి వాటికి చాలా డిమాండ్ పెరుగుతోంది. తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు పలువురు. కాగా నల్ల బియ్యానికి డిమాండ్ పెరుగుతోందట. అసలు ఏంటా నల్ల బియ్యం తెలుసుకుందామా. పోషక గుణాలు అధికంగా ఉన్న నల్లబియ్యానికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఛతీస్‌గఢ్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ మాట్లాడుతూ.. ప్రకృతి హితంగా పండించిన ఇలాంటి ఆహారం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి శక్తిమంతమైన జాతి తయారవుతుందన్నారు. మన మహర్షులు అందించిన వ్యవసాయ విజ్ఞానమే ఈ నల్లధాన్యం సాగు విజయానికి కారణమన్నారు. కాగా, నల్లధాన్యం పంట సాగుకు ఎకరాకు రూ.10 వేల లోపు ఖర్చు చేసినట్లు కౌటిల్య కృష్ణన్ పేర్కొన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేయడంతో ట్రాక్టర్ ఖర్చు, కూలీల ఖర్చుతోనే సరిపోతుందన్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి మొదట కిలో విత్తనాలు తీసుకొచ్చి నారుపోసి పంట సాగుచేసినట్లు చెప్పారు. ఇలా పండిన ధాన్యాన్నే మళ్లీ విత్తనంగా వాడి.. ఈ ఏడాది 2ఎకరాల్లో నాటగా 40 క్వింటాళ్ల పంట వచ్చిందన్నారు. ఈ ధాన్యం కిలో రూ.300 నుంచి రూ.3వేల వరకు ఉంటుందన్నారు. కేన్సర్, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలో నల్ల బియ్యం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ బియ్యంలో ప్రొటీన్లతో పాటు లిపిడ్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయని, మెదడు, కాలేయ పనితీరును మెరుగుపరచి మలబద్దకాన్ని, అతిసారను నియంత్రిస్తాయన్నారు. కడుపులో మంట, షుగర్ లెవల్స్‌ను కూడా తగ్గిస్తుందని కౌటిల్య కృష్ణన్ వివరించారు.