ఆల్కహాల్ తీసుకోకపోయినా కాలేయంపై ప్రభావం..

మద్యం సేవించడం వల్ల పలు అనారోగ్యాలకు గురి అవుతారని..లివర్ పాడవుతుందని చెబుతుంటారు.కానీ ఇక్కడ చేసిన పరిశోధనలో కొవ్వు పేరుకుపోయి కాలేయం పనిచేయని స్థితికి కారణమయ్యే ‘నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ తీవ్రతను తగ్గించే విధానాన్ని నార్త్‌ కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. రక్తంలోని చెక్కర స్థాయిలను నియంత్రించగలిగితే ఈ వ్యాధి ముప్పు తగ్గించవచ్చని పేర్కొన్నారు. 713 రోగులపై పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని చెబుతున్నట్టు వెల్లడించారు. సాధారణంగా ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకునే వారికి ‘ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ వస్తుంది. అయితే, ఆల్కహాల్‌ తీసుకోకపోయినప్పటికీ కొందరి కాలేయంపై కొవ్వు పేరుకుపోవడాన్ని వైద్య నిపుణులు గుర్తించారు. దీనికి ‘నాన్‌-ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌’ అని పేరు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *