ఆవిసెగింజల నూనె..ప్రయోజనాలు ఎన్నో..

ఇప్పుడు ఎన్నో కొత్త కొత్త ఆయిల్స్ మార్కెట్స్ లోకి వస్తున్నాయి. కొన్ని ఆయిల్స్ తో ఎన్నో లాభాలుంటాయి..శరీరానికి ఎంతో రిలీఫ్ ని ఇస్తాయి. ఆలివ్ ఆయిల్, లావెండర్ ఆయిల్, జొజోబా ఆయిల్, మొదలైన ఆయిల్స్‌ని మీరు వాడి ఉండొచ్చు కానీ ఎప్పుడైనా అవిసెగింజల నూనె వాడారా..దీని ప్రయోజనాలు తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. ఇది మీ శరీరాన్ని లోపల నుంచి డిటాక్సిఫై చేయడమే కాకుండా, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తొలగించడానికి, పిగ్మెంటేషన్ మార్కులను తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది. అవిసె గింజల నూనె ప్రయోజనాలను ఒక్కసారి తెలుసుకుందాం. అవిసెగింజల నూనె చర్మంపై ఏర్పడిన దద్దుర్లు, దురదను తగ్గిస్తుంది. దీర్ఘ కాలిక చర్మవ్యాధులకు ఈ నూనె చక్కటి పరిష్కారం చూపిస్తుంది. మీ వేలుపై ఈ నెనె ఒక చుక్క వేసుకొని చర్మంపై ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వేసుకొని రుద్దండి. వెంటనే ఆ సమస్య పరిష్కారమవుతుంది. అవిసెగింజల నూనె మీ చర్మాన్ని తేమగా చేస్తుంది. లోపల నుంచి హైడ్రేట్ గా ఉంచుతుంది. మీరు ఈ నూనెను తేలికపాటి మాయిశ్చరైజర్‌తో మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి అప్లై చేయండి. చక్కని ముఖ తేజస్సు మీ సొంతమవుతుంది. అవిసెగింజల నూనె అప్లై చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ను గణనీయంగా తగ్గుతాయి. మీ కళ్ల కింద ఈ నూనె పూసిన వారం రోజుల తర్వాత వాటి చుట్టూ స్పష్టమైన తేడాను మీరు గమనించవచ్చు. ఇంకా ఆ ప్రాంతం ప్రకాశవంతంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యూటీ ప్రొఫెషనల్స్ ఈ ఆయిల్‌ని వాడుతారు. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. మీ ఆహారంలో అవిసె గింజలను చేర్చడం ద్వారా, సూర్యుని హానికరమైన UV కిరణాల నుంచి తప్పించుకోవచ్చు. అవిసెగింజల నూనె మీ జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఒక చెంచా అవిసె నూనెను ఒక గ్లాసు వేడి నీటిలో కలుపుకొని తాగితే మీ సిస్టమ్‌ మొత్తం శుభ్రం అవుతుంది. మీరు తిన్న ఆహారాన్ని రోజంతా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *