కరోనా తగ్గిన తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా..

ఇప్పుడంతా కరోనా పరిస్థితులుగా మారాయి. ఈ కరోనా బారిన పడి ఎంతో మంది పలు అనుమానాలతో సందిగ్థంలో పడుతున్నారు.ఇక కరోనా బారిన పడిన వారు ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో పాల్గొనాలి అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఆ విషయాలు తెలుసుకుందాం. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి కరోనా సోకినా, తగ్గిన తర్వాత నెల పాటు శృంగారానికి దూరంగా ఉండటం మంచిది. కనీసం మూడు వారాలైనా నిగ్రహం పాటించాలి. దంపతులిద్దరికీ కరోనా వస్తే నెల కంటే ఎక్కువ కాలం దూరంగా ఉండాలి. లేదంటే ఒకరి ప్రభావం మరొకరిపై పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యపై జన్యుపరంగా ఎలాంటి పరిశోధనలు జరగలేదు. కానీ పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కరోనా తగ్గిన తర్వాత కూడా కొంతమందికి లక్షణాలు ఉంటున్నాయి. దీనికితోడు శరీరం నీరసించి ఉంటుంది. శృంగారం అనేది ఒత్తిడితో కూడుకున్నది. కరోనా వచ్చిన పురుషుల వీర్యంలో పలు మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొన్నా ఇబ్బందేమీ ఉండదు. వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటే అవి తగ్గేంత వరకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు తెలిపారు.. భార్యాభర్తల్లో ఎవరికైనా కరోనా వస్తే కనీసం నెల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని చెప్తున్నాం. తొందరపడి ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌ చేసుకోవద్దు. కనీసం మూడు నెలలపాటు వేచి ఉండటం మంచిది. అనుకోకుండా ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే ఏమీ చేయలేం. కరోనా వల్ల అబార్షన్‌ అవుతుందని భావించలేం. అబార్షన్‌ చేసుకోవాల్సిన అవసరమూ లేదు. మధ్యస్థాయి లక్షణాలు ఉన్నాయని ఇంట్లోనే సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఐదారు రోజులు ఇంట్లోనే ఉండి మందులు వేసుకుంటున్నారు. దీంతో వారి పరిస్థితి సీరియస్‌ అవుతున్నది. ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోతున్నాయి. ఇతరులతో పోల్చితే గర్భిణుల్లో ఊపిరితిత్తులపై వైరస్‌ ప్రభావం చాలా తొందరగా పడుతున్నది. కాబట్టి తొందరగా డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. గుండె సంబంధిత ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పుడు నా వద్ద తొమ్మిది మంది పేషెంట్లు ఉన్నారు. అందులో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. వీరిలో ఇద్దరు నిండు గర్భిణులు. తల్లికి కరోనా సోకినా పిండానికి రాదని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ మా వద్ద పుట్టిన ఒక బేబీకి ఒకరోజు తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తల్లి పాజిటివ్‌తో చికిత్స పొందుతూనే డెలివరి అయింది. గర్భంలోనే ఆ బేబీకి కరోనా సోకిందా? బయటకు వచ్చిన తర్వాత సోకిందా అనేది అర్థం కావడంలేదు. అయితే దీనిపై సొంతంగా ఒక స్టడీ చేయాలని నిర్ణయించి, ఉమ్మనీరుపై పరీక్ష చేస్తున్నాం. ఆ ఫలితాలు రావాల్సి ఉంది. కాబట్టి గర్భిణులు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *