కరోనా నుంచి కోలుకున్న వారిలో గుండెజబ్బుల లక్షణాలు

కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమందిలో గుండెజబ్బుల లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయాసం (శ్వాసలో ఇబ్బంది), ఛాతి నొప్పి, ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం, మైకం కమ్ముకోవడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి అయిదు లక్షణాలు ఇటీవల పలువురు రోగుల్లో ప్రధానంగా కనబడుతున్నాయి. చికిత్స సమయంలోనూ, కోలుకున్న తర్వాత కూడా ఈ లక్షణాలు వెంటాడుతున్నట్టు తెలుస్తున్నది. కొవిడ్‌నుంచి కోలుకున్న వారిలో 70 శాతం మంది గుండెజబ్బులకు సంబంధించిన ఏదో ఒక లక్షణంతో ఇబ్బంది పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.చాలామంది శరీరంలో ఆక్సిజన్‌ కొరతే గుండె సమస్యలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. కరోనా తీవ్రత కారణంగా స్టెరాయిడ్స్‌ వాడకం, ఇన్ఫెక్షన్‌ ప్రభావం వల్లకూడా కొందరు హృద్రోగం బారిన పడుతున్నారు. టెన్షన్‌, భయం వల్లా కొన్నిసార్లు ఎటువంటి సమస్యలూ లేకుండానే ఆయాసం, ఛాతి నొప్పి వస్తున్నాయి. కరోనా వచ్చాక రక్తం చిక్కగా మారడం వల్లకూడా హార్ట్‌ ఎటాక్‌కు ఆస్కారం ఏర్పడుతుంది. కరోనా ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తుల్లో చేరడంతో ఆయాసం, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం, ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం, చెమట పట్టడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.మొదటిది శ్వాసలో ఇబ్బంది. సరిగా ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఆయాస పడటం వంటి సమస్యలు ఉన్నవాళ్లలో శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రభావం గుండెపైనే కాకుండా ఊపిరితిత్తుల మీదా పడుతుంది. రెండోది ఛాతి నొప్పి. గుండె భారంగా ఉండటం, ఒక రకమైన అసౌకర్యం, అనవసర ఆందోళన కొందరిలో కనిపిస్తాయి. మరికొందరిలో భరించలేని నొప్పి ఉంటుంది. ఈ నొప్పి చేతులు, మెడ, ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది.కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు..మూడోది ఆక్సిజన్‌ స్థాయి తగ్గడం. చికిత్స పొందుతున్నవారు, కోలుకున్న వారిలోకూడా ఆక్సిజన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనబడతాయి. పల్స్‌ ఆక్సిమీటర్‌తో ఆక్సిజన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల సమస్య తీవ్రతను ముందుగా గుర్తించే అవకాశం ఉంది. ఆక్సిజన్‌ స్థాయి పడిపోవడం వల్ల గుండె కొట్టుకోవడంలో మార్పులు, ఇతర ప్రభావాలు కనిపిస్తాయి.కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు నాలుగో లక్షణమైన మైకం కమ్మడాన్నీ తేలిగ్గా తీసుకోలేం. కరోనా ప్రభావం అధికంగా ఉన్నవారిలో చికిత్స సమయంలో, కోలుకున్న తర్వాత కూడా అతిగా నిద్ర పోవాలనిపిస్తుంది. మగతవల్ల నిలబడటం, కూర్చోవడమూ కష్టమవుతుంది. విపరీతంగా చెమట పట్టడంఅయిదో లక్షణం. అలసట, శారీరక బలహీనత, శ్వాస తీసుకోవడంలో అవస్థ, వైరస్‌ ప్రభావం వంటి కారణాలతో విపరీతంగా చెమట పట్టవచ్చు. ఇది గుండెపోటు ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఈ లక్షణాలున్నవారు తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి.దీర్ఘకాలిక వ్యాధులున్నవారు నిత్యం వాడాల్సిన మందుల్ని పక్కన పెట్టేయడం వల్ల పాత జబ్బులు తిరగబెడుతుంటాయి. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, శారీరక కార్యకలాపాలు మందగిస్తున్నాయి. ఇది మంచిది కాదు. చిన్నపాటి వ్యాయామం అయినా చేయాలి. అంతేకాదు, నాలుగు గోడలకే పరిమితమవుతున్నందున, మితాహారం ఉత్తమం. ‘కొవిడ్‌ సీజన్‌ తర్వాత చూద్దాంలే..’ అన్న నిర్లిప్తతతో ఔషధాలు వాడక పోవడం మంచిది కాదు. వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న సాకూ సరికాదు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ఫోన్‌లోనో, ఆన్‌లైన్‌ ద్వారానో డాక్టర్లను సంప్రదించే అవకాశం ఉండనే ఉంది.గత ఏడాది గుండె సమస్యలున్న ఓ వ్యక్తికి స్టెంట్‌ వేశాను. ఆయనకు మరో రక్తనాళంలో కొంతమేర బ్లాకేజీ ఉంది. దానికికూడా యాంజియోగ్రామ్‌ చేయాల్సి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తూ వస్తున్నాం. అయితే, ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, నాలుగు రోజుల కిందట ఆయాసం వస్తున్నది, చెమటలు విపరీతంగా పడుతున్నాయంటూ వచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం ఏమీ లేవు.
కరోనా రోగుల్లో కొత్త లక్షణాలు .. కోలుకున్నాక హృద్రోగాలు, శ్వాస రుగ్మతలు
కరోనా సోకిందేమో’ అన్న అనుమానంతో సీటీ స్కాన్‌ చేస్తే ఆయన ఊపిరితిత్తుల్లో వైరస్‌కు సంబంధించిన ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా కనబడింది. అదే విధంగా తాండూరు నుంచి ఓ పేషెంట్‌ వచ్చారు. అతనిదీ అదే పరిస్థితి. కరోనా లక్షణాలు ఏవీ లేవు. ఛాతీ నొప్పి ఉందన్నారు. 2డీ ఇకొ పరీక్షద్వారా ఆయన గుండెలో మూడు నాలుగు పెద్ద రక్తం గడ్డలు ఉన్నట్లు గుర్తించాం. గుండె కుడి, ఎడమ భాగాల్లో రక్త ప్రసరణకు ఆటంకం ఉన్నట్లు నిర్ధారించాం. రోగికి అంతకు ముందు ఎటువంటి గుండె సంబంధిత సమస్యలూ లేవు. కరోనా ప్రభావం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం. ఏ లక్షణాలనూ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *