కొత్త వారిని చూస్తే పిల్లలు ఎందుకు భయపడతారో తెలుసా..

చిన్న పిల్లలు చాలామంది కొత్త వారిని చూస్తే తెగ భయపడి పోతుంటారు..అంతేనా గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూ వుంటారు కూడా. మరి ఎందుకు అలా వారు చేస్తారో తెలుసుకుందాం.. సాధారణంగా పిల్లలు కొత్తవారు అంటే భయపడటం సహజంగానే జరుగుతుంది. కొత్తవారి దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు. బలవంతంగా ఎత్తుకుంటే ఏడుస్తారు. పిల్లల్లో మూడు, నాలుగు నెలల నుంచే కొత్తవారంటే భయం ఏర్పడుతుంది. ఈ భయం రెండు సంవత్సరాల వరకు ఉంటుందని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. కొంతమంది పిల్లలకు కొత్త, పాత ఉండదు. ఎలాంటి భయం లేకుండా కొత్తవారి దగ్గరకు కూడా చనువుగా వెళ్లిపోతారు. ఇటువంటి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు.చంటి పిల్లల విషయంలో తల్లులు చిరాకు పడకూడదు. ఇది కొంత వరకు సహజమే అయినా ఎక్కువగా భయపడే పిల్లల్లో దీని కారణముగా పెద్దయ్యాక కొన్ని మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. చంక దిగడానికి ఏడ్చే పిల్లలను లాలిస్తూ. బుజ్జగిస్తూ ఇంట్లో వారిని, ఇరుగు పొరుగువారిని అలవాటు చేస్తూ వారి దగ్గరకు కూడా వెళ్లేటట్లు చేయాలి. తల్లి ఇలా అలవాటు చేయడం వల్ల పిల్లలు క్రమ క్రమంగా ఇతరులంటే భయం లేకుండా వారి దగ్గరకు కూడా వెళ్తుంటారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే మహిళలకు చంటి పిల్లల విషయంలో ఈ సమస్య తప్పదు. ఇంట్లో ఉండే పెద్దవారికి గానీ, పిల్లలకు గానీ పిల్లలను ముందు కొంత ఓర్పుతో అలవాటు చేయాలి. బలవంతంగా పిల్లలను ఇతరులకు అప్పగించం, వారు బిగ్గరగా ఏడవడం వల్ల వాళ్లలో భయం ఇంకా పెరుగుతూ ఉంటుంది. బుజ్జగింపు మాటలతో, చేతలతో ఇతరులు కూడా మన వాళ్లేనన్న భావాలను పిల్లలకు కలిగిస్తూ నిదానంగా పిల్లల్లో భయం పోగొట్టాలి. భయం పోయిన పిల్లలు ఇతరులపై నమ్మకం, వారి పట్ల ఇష్టాన్ని కూడా పెంచుకుంటారు. ఇదే కాకుండా పిల్లల్లో వయసు పెరుగుతున్నా రకరకాల భయాలు ఉంటాయి. వాటిని గమనించి అటువంటి భయాలను తొలగించడానికి ప్రయత్నించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *