క్యాన్సర్ రోగులు వ్యాక్సిన్ తీసుకోవచ్చా..

అందరూ కరోనా నుండి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ బాట పడుతున్నారు. కాగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడంపై పలు అనుమానాలు..సందేహాలు ఉన్నాయి చాలామందిలో. కాగా క్యాన్సర్‌ రోగులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా.. తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా క్యాన్సర్‌ శస్త్రచికిత్స తర్వాత వ్యాక్సిన్‌వల్ల ఇబ్బంది ఉంటుందన్నది నిజమేనా.. ఇలాంటి ఎన్నో అనుమానాలు. ఇవన్నీ అపోహలే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా క్యాన్సర్‌ రోగులు కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే.ఇమ్యునో సప్రెసివ్‌ థెరపీని పొందుతున్నవారు, స్టెమ్‌సెల్‌ మార్పిడి చికిత్స చేయించుకున్నవారు మాత్రం చికిత్స పూర్తయిన 3 నెలల తర్వాతే కొవిడ్‌ టీకా తీసుకోవాలి. సాధారణ రోగులు టీకా ఏర్పాట్లు చేసుకోవచ్చు. క్యాన్సర్‌ తీవ్రత అధికంగా ఉన్నవారు, తమకు జరుగనున్న శస్త్రచికిత్సను బట్టి కొన్ని రోజులు వాయిదా వేయవచ్చు. ఇక, చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకున్నవారు వారం తర్వాత తీసుకుంటే మంచిది.క్యాన్సర్‌ చికిత్స సమయంలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. క్లినికల్‌ ట్రయల్స్‌లో కూడా చెడు ఫలితాలు కనిపించలేదు.క్యాన్సర్‌ పేషెంట్లకు సేవలందించేవారు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. మాస్క్‌, పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎందుకంటే, క్యాన్సర్‌ పీడితులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారికి కరోనా సోకితే, వ్యాధి తీవ్రత పెరిగే ఆస్కారం ఉంది.సైటోటాక్సిక్‌ కీమోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, హార్మోన్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్‌ వంటివి చేయించుకోవాల్సిన రోగులు ఇవి పూర్తయిన 6 నెలల తర్వాత టీకా వేయించుకుంటే మంచిది.ఏ నిర్ణయానికి ముందు అయినా, ఒకసారి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *