గర్భ నిరోధక మాత్రలు..ఆడవారికే ఎందుకు..!

గర్భం దాల్చడం..పిల్లల్లి కనడం..నెలసరి బాధలు ఇవి సరిపోవు అన్నట్టుగా గర్భం రాకుండా నిరోధించడంలో కూడా ఆడవారికే బాధలు.. 1960వ దశకంలో మొట్ట మొదటిసారిగా గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి.గర్భ నిరోధక మాత్రలు కనిపెట్టి ఆరు దశాబ్దాలు దాటింది.ప్రస్తుతం 20 రకాల గర్భ నిరోధక పద్ధతులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంది.అయితే, ఈ పద్ధతుల్లో పురుషులకు సంబంధించినవి మాత్రం కేవలం రెండు మాత్రమే.అవే కండోమ్స్, స్టెరిలైజేషన్‌ లేదా వాసెక్టమీ.ఆడవాళ్లకు ఉన్నట్లుగా మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు..“మహిళలకు గర్భ నిరోధక మాత్రలను తయారు చేయాలనే ఆలోచన ఊపిరి పోసుకున్న నాటి నుంచి పురుషులకూ సంతాన నిరోధక మాత్రలను కనిపెట్టాలనే ఆలోచన ఉంది” అని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో పునరుత్పత్తి జీవశాస్త్ర ప్రొఫెసర్​గా పనిచేస్తున్న ఆడమ్ వాట్కిన్స్ అన్నారు.ఒక మహిళ నెలకు ఒక అండాన్ని మాత్రమే విడుదల చేస్తుంది. కానీ ఒక పురుషుడిలో రోజుకు కొన్ని లక్షల వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి. పురుషుడు పునరుత్పత్తి శక్తిని 90శాతం కోల్పోయినా, సంతానం కలుగుతుంది.మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు తయారు చేయడంలో ఇదొక సవాలుగా మారిందని వాట్కిన్స్ వెల్లడించారు.అయితే పురుషులకు సంతాన నిరోధక మాత్రలు అభివృద్ధి చెందకపోవడానికి ఇదే ప్రధాన కారణం కాదు.స్త్రీలకు కనిపెట్టిన గర్భ నిరోధక మాత్రలు విజయవంతం కావడమే పురుషులకు సంతాన నిరోధక మాత్రలను అభివృద్ధి చేయలేకపోవడానికి కారణమని నేను భావిస్తున్నాను. మహిళల మాత్రలు సమర్థవంతంగా పని చేస్తున్నాయి.ఆర్థిక కోణంలో చూస్తే, ఔషధ కంపెనీలకు కొత్త రకం మందుపై పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. వేర్వేరు కారణాల వల్ల గర్భ నిరోధక భారం మహిళల మీద పడింది. వారు దాదాపు ఆ బాధ్యతను పూర్తిగా స్వీకరించారు. ఇది కొంచెం అన్యాయమైన విషయం” అని వాట్కిన్స్​ వివరించారు.బహుషా అతి పురాతన గర్భ నిరోధకం కండోమే కావొచ్చు. క్రీస్తు పూర్వం దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే పురుషులు సంతాన నిరోధక పద్ధతిని అవలంభించినట్లు ఆధారాలున్నాయి.ఆ కాలంలో వీర్య కణాలు అండం దరి చేరకుండా భౌతిక అవరోధాన్ని వాడేవారు.ఆ తర్వాత 18వ శతాబ్ధంలో పురుషులకు కొత్త రకం శస్త్ర చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టారు. అదే వాసెక్టమీ.20వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో ఆడవారికి గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. పురుషుల పిల్స్‌పై కూడా పరిశోధనలు ప్రారంభమయ్యాయి.సిద్ధాంతపరంగా, వీర్య కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి సులువైన ప్రక్రియ కావాలి. వీర్య కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి? అవి అండాన్ని ఎలా చేరుకుంటాయనేది బాగా తెలిసిన విషయమే” అని వాట్కిన్స్ చెప్పారు.ఈ అంశంపై ప్రస్తుతం రెండు రకాల పరిశోధనలు జరుగుతున్నాయి.మొదటిది, ఆరోగ్యకరమైన వీర్య కణాల అభివృద్ధిని తాత్కాలికంగా నిలిపివేయడానికి సింథటిక్ (కృత్రిమ) హార్మోన్లను ఉపయోగించడం.రెండోది, కృత్రిమ హార్మోన్లు వాడకుండా, ఆరోగ్యకరమైన వీర్య కణాలు లోనికి ప్రవేశించకుండా, ఫలదీకరణం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం.అయితే, పురుషులకు సంతాన నిరోధక మాత్రలు కనిపెట్టే అధ్యయనాలకు మరో సమస్య ఎదురైంది. వాటిలో వాడే రసాయనాలు దుష్ప్రభావాలను చూపించడం మొదలుపెట్టాయి.ఉదాహరణకు 2016లో మహిళల పిల్స్‌లో ఉండే హార్మోన్లను పోలిన టెస్టోస్టిరాన్, ప్రొజెస్టోజెన్‌లతో కూడిన మందును పురుషులపై ప్రయోగించారు. కానీ ఆ పరిశోధనను ఆదిలోనే నిలిపేయాల్సి వచ్చింది.చర్మంపై మొటిమలు, మూడ్ డిజార్డర్స్, శృంగార కోరికలు పెరగడం వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. ఇవి చాలా తీవ్రమైనవని, భరించలేనివని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న పురుషులు భావించారు. దాంతో ఈ పరిశోధనలకు బ్రేకులు పడ్డాయి” అని వాట్కిన్స్ వివరించారు.భవిష్యత్తులో పురుషుల సంతాన నిరోధక మాత్రలు వచ్చి తీరుతాయని వాట్కిన్స్, కాంపో – ఇంజెల్​స్టైన్ విశ్వసిస్తున్నారు.ఔషధ తయారీ కంపెనీలు ఈ మాత్రల అభివృద్ధిపై దృష్టి సారిస్తాయని నేను భావిస్తున్నాను. చాలా మంది మగవాళ్లు ఈ పిల్స్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు” అని వాట్కిన్స్ అన్నారు.‘క్లీన్​ షీట్​ పిల్​’, ‘వాసల్​జెల్​’ అనే రెండు రకాల సురక్షితమైన సంతాన నిరోధక పద్ధతుల గురించి వాట్కిన్స్​ ప్రధానంగా ప్రస్తావించారు.క్లీన్​ షీట్​ పిల్​ వాడకం వల్ల వీర్య కణాల విడుదలను తగ్గించొచ్చు. ఫలితంగా గర్భం ధరించే అవకాశాలు తగ్గుతాయి. మరోవైపు ఈ పద్ధతిలో లైంగికంగా సంక్రమించే వ్యాధులను కూడా నిరోధించవచ్చు.ప్రస్తుతానికి ఈ మాత్రను కేవలం జంతువుల మీద మాత్రమే ప్రయోగించారు. మనుషులకు సరిపడే మాత్రను సిద్ధం చేసేందుకు మరో పదేళ్లు పట్టొచ్చు.వాసల్​జెల్​ శుక్ర కణాలను నిలువరిస్తుంది” అని వాట్కిన్స్​ వివరించారు.ప్రయోగశాలలో వాడుతున్న సాంకేతికత, ఫలితాలు సామాజిక మార్పును తీసుకొచ్చేటంత స్థాయిలో లేవని కాంపో–ఇంజెలిస్టైన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.సామాజిక న్యాయం కింద గర్భ నిరోధకత అనేది అందరి బాధ్యత కావాలి. ఇలా జరగాలంటే, పురుషులకు సంతాన నిరోధక మాత్రలను ఔషధ కంపెనీలు తయారు చేసి తీరాలి” అని కాంపో–ఇంజెలిస్టైన్ నొక్కి చెప్పారు.సామాజిక కట్టుబాట్లు, పురుషుడిదే పైచేయి అనే భావన తొలగకపోతే పిల్స్ కనిపెట్టినా, దాని వాడకం మాత్రం మహిళలతో సమాన స్థాయికి చేరుకోలేదని కాంపో–ఇంజెలిస్టైన్ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *