గాడిద పాలతో ఆరోగ్యం..

గాడిద పాలు ఆరోగ్యానికి మేలని తెలిసిన విషయమే. గాడిద పాలు మానవ రొమ్ము పాలు, ఆవు పాలతో సమానమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయట. అందుకనే శిశువులకు ఇవి పట్టించడం మంచిదని అంటుంటారు. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి కేలరీలు, విటమిన్- డి ఎక్కువగా అందుతాయి. ఇవి లాక్టోస్ రూపంలో ఉంటాయి. ఆర్థరైటిస్, దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లను నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిద పాలు ఉపయోగిస్తారు. దీంట్లోని యాంటీ-మెక్రోబయాల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్ల నుంచి దూరం చేసేందుకు సహాయపడతాయి.ముఖ్యంగా అలెర్జీని దూరం చేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఆవు పాలతో పోలిస్తే.. గాడిద పాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్, సమానస్థాయిలో ప్రొటీన్లు కలిగి ఉంటాయి. అందుకనే వీటిని తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.గాడిద పాలలో మరొక ముఖ్యమైన భాగం లాక్టోస్. ఇది మీ శరీరం కాల్షియం గ్రహించడానికి సహాయపడి, ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.వీటిలోని ఇతర సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ప్రోటీన్లు సైటోకిన్‌ల విడుదలను ప్రోత్సహించే సామర్థ్యాన్ని గాడిద పాలు కలిగి ఉన్నాయి.గాడిద పాలు కణాలను నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేయడానికి కారణమవుతాయి. రక్త నాళాలను విడదీసి, నైట్రిక్ ఆక్సైడ్ మీ రక్త నాళాలకు అందించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది.గాడిద పాలు ఆహార పదార్థంగా కంటే ఎక్కువ సౌందర్య సాధనంగా పనిచేస్తాయి. వీటిలోని ప్రొటీన్లు నీటిని ఆకర్షించి , పట్టు సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి.వీటిలోని ప్రోటీన్లు యాంటీఆక్సిడెంట్లుగా కూడా పనిచేస్తాయి. అవి సూర్యరశ్మి వలన కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి, తద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.గాడిద పాలతో స్నానం చేయడం వల్ల మెత్తని, మృదువైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.గాడిద పాలు సౌందర్య ఉత్పత్తులైన స్కిన్ క్రీములు, ఫేస్ మాస్క్‌లు, సబ్బులు మరియు షాంపూల తయారీలో వాడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *