గోళ్ల ద్వారా అనారోగ్యాన్ని గుర్తించవచ్చట..

మన శరీరం అనారోగ్యానికి గురవుతున్న సమయంలో పలు భాగాల ద్వారా మనం ఇట్టే కనిపెట్టవచ్చట, వాటిల్లో గోళ్ళు కూడా ఒకటి. మరి ఆ వివరాలు వివరంగా చూసేద్దాం. విషయంలోకి వెళ్తే జుట్టు మాదిరిగానే గోళ్లు కూడా కెరోటిన్‌ అనే ప్రొటీన్‌తో ఏర్పడుతాయి. గోర్లు ఆరోగ్యంగా ఉంటే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లుగానే లెక్కించుకోవాలి. అవి బలంగా ఉండాలంటే పోష‌కాహారం శ‌రీరానికి అందివ్వాల‌ని వైద్య‌నిపుణులు సూచిస్తున్నారు.డయాబెటిస్ స‌మ‌స్య రాగానే మ‌న కాలి, చేతి గోళ్లు పసుపు రంగులోకి మార‌డంతోపాటు పెళుసుగా త‌యార‌వుతాయి. ఒనికోమైకోసిస్ అనే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ గుర్తులుగా ఇలా గోర్ల‌పై ప‌సుపు రంగు క‌నిపిస్తుంది. ఇలా రావ‌డం మీలో టైప్ 2 డ‌యాబెటిస్‌ను ప్రారంభమ‌య్యేందుకు సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారిలో ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాలి పెద్ద గోరు సాధార‌ణంగా ఒనికోమైకోసిస్‌కు ప్ర‌భావిత‌మ‌వుతుంది. ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా గోర్ల‌పైనే క‌నిపిస్తుంది. గోరుపై గీత‌లు కూడా క‌నిపిస్తాయి. గోరు అంచులు విరిగిపోతుండ‌టం, ప‌గుళ్లు ఏర్పడుతుండ‌టం గ‌మనించ‌వ‌చ్చు. ఒకటి లేదా రెండు గోర్ల‌లో 50 శాతం కన్నా తక్కువ ప్రభావితం చేసే తేలికపాటి ఇన్ఫెక్షన్లు అందుబాటులో ఉండే సాధార‌ణ‌ యాంటీ ఫంగల్ మందులకు ప్రతిస్పందిస్తాయి. అయితే పూర్తిగా నివార‌ణ‌కు యాంటీ ఫంగ‌ల్ మందుల‌ను ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎక్కువ‌గా 60 ఏండ్ల వ‌య‌సు పైబడిన వారిలో కనిపిస్తుంది.క్తంలో అధిక చక్కెరకు సంకేతాలు..దాహం పెరుగుతుంది, నోరు పొడిగా ఉంటుంది.త‌రుచుగా మూత్రి విస‌ర్జ‌న‌కు వెళ్తుంటారు.చిన్న ప‌నికే అల‌స‌టగా ఉంటుంది.దృష్టి మ‌స‌క‌గా ఉండ‌టం.అనుకోకుండా బరువు తగ్గడం.మూత్రాశయ ఇన్ఫెక్షన్, చర్మ ఇన్ఫెక్షన్ వంటివి రావ‌డం.కడుపు నొప్పి రావ‌డం.అనారోగ్యానికి గుర‌వడం లేదా అనుభూతి క‌లుగ‌డం వంటి సంకేతాలు క‌నిపిస్తాయి. వీటిని బ‌ట్టి మ‌న ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరుగుతున్న‌ట్లు గుర్తించి తగు వైద్యం తీసుకోవ‌డం అవ‌సరం. ఇలాంటి స‌మ‌స‌య మొద‌ల‌వ‌గానే చ‌క్కెర లేని ద్ర‌వాలు, నీరు ఎక్కువ‌గా తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. నిత్యం అర్ధ‌గంట‌కు త‌క్కువ కాకుండా వ్యాయామం చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. చెడు అల‌వాట్ల‌ను దూరం పెట్టాలి. పోష‌కాహారాన్ని ప్లేటులో ఉండేలా చూసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *