చిలకడ దుంపల్లో ఇమ్యూనిటీ పవర్..

ఒక్కో సీజన్ కి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టే..ఆ సమయంలో ఫుడ్ కి కూడా ఇంపార్టెంట్ ఉంటుంది…అయితే వర్షా కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను పరిష్కరించడంలో చిలగడదుంప ఎంతో బాగా ఉపకరిస్తుంది. మంచి ఇమ్మ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల పలు రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు.ఈ వర్షాకాలంలో చిలకడ దుంపలు తినడంవల్లఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ “ఏ”,”సీ”,మాంగనీస్, విటమిన్ “బీ6”, పొటాషియం,పాంటోథెనిక్ యాసిడ్,కాపర్,నియాసిన్ వంటి వి చిలగడదుంపలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి. అంతేకాదు వీటిలోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలుగుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి.ఈ దుంపల్లో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లలో కాంతిని గ్రహించే రిసెప్టర్లు తయారయ్యేలా చేస్తుంది. దాని వల్ల కంటి చూపు మెరుగవుతుంది. ఈ కాలంలో విరివిగా దొరికే చిలకడ దుంపలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.ఇమ్మ్యూనిటీ బూస్టర్ :వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన దుంప..ఎందుకంటే ఆ తొక్కలో కూడా కాన్సర్‌ను అడ్డుకునే గుణాలు ఉంటాయట. ఈ రోజుల్లో మనకు బాగా కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. చిలకడ దుంపల్లో అది బోలెడంత ఉంటుంది. వీటిలోని విటమిన్ “ఏ” వ్యాధినిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అంతేకాదు మధుమేహ బాధితులకు చిలగడ దుంపలు ఓ వరం లాంటివి. ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి.
చిలగడ దుంపలకు తీసుకోవడం మంచిది. చిలగడ దుంపలలో ఉండే అధిక స్థాయి పొటాషియం హార్ట్ బీట్ క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. ఇవి మన శరీరంలోని కండరాలు, నరాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి. ఈ దుంపలు మన పొట్టలోని పేగులు, ఆహార నాళాన్ని శుభ్రం చేస్తుంది. అక్కడి విష వ్యర్థాలను తరిమేస్తుంది. పేగుల్లో ఉండే ప్రో బ్యాక్టీరియాకి చిలకడ దుంపలు బలాన్నివ్వడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *