డయాబెటీస్ రోగులు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఇప్పుడు పలువురు డయాబెటీస్ బారిన పడుతున్నారు..చిన్న వయసు వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం శోచనీయం. అయితే డయాబెటిస్ రోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా ఇబ్బందే. అలాంటిది, కొవిడ్ బారినపడ్డ మధుమేహ రోగులు మరింత ఎరుకతో ఉండాలి. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..ఇంట్లోనే తరచూ బ్లడ్ గ్లూకోజ్ చెక్ చేసుకోవాలి.తిన్న వెంటనే, సహజంగానే శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి రోజూ ఒకే మోతాదులో ఆహారం తీసుకోవాలి. లేకపోతే, బ్లడ్ గ్లూకోజ్ స్థాయులపై ఆ ప్రభావం పడుతుంది.భోజనం నుంచి స్నాక్స్ వరకు అన్నిటినీ రోజూ ఒకే సమయానికి తీసుకోవాలి. రోజూ మూడు మేజర్ మీల్స్, ఐదు మైనర్ మీల్స్ తినాలి.ఫైబర్ డైట్‌ను అలవర్చుకోవాలి. ఉదాహరణకు ఓట్స్, వీట్ బ్రాన్, శనగపిండి, సోయా పదార్థాలు, చిరు ధాన్యాలు, ఆకుకూరలు, బ్రకోలీ, అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోవాలి.
తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులను అడగాలి. మద్యం, ధూమపానం సాధ్యమైనంత దూరం పెట్టాలి. ఆహారంలో దాల్చిన చెక్క, వెల్లుల్లి తరచూ వాడాలి. అందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి..
మెంతులు: ఒక టీ స్పూన్ మెంతులను అర కప్పు నీళ్లలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తాగాలి.
ఫైబర్ ఫుడ్: పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బీన్స్, బ్రకోలీ, పాలకూరలను రోజూ తీసుకోవాలి.
పండ్లు : డయాబెటిక్ పేషెంట్లు తొక్కతోసహా తినగల పండ్లను ఎంచుకోవాలి. కారణం, తొక్కలో ఫైబర్ ఉంటుంది. అది పండ్లలోని కార్బొహైడ్రేట్లు చక్కెరగా మారే క్రమాన్ని నెమ్మదించేలా చేస్తుంది.
నట్స్: బ్లడ్ షుగర్ నియంత్రణలో బాదంపప్పు తోడ్పడుతుంది.
కడుపు మాడ్చొద్దు : అందరిలా రోజుకు మూడు పూటలు కాకుండా, తక్కువ మోతాదులోనైనా సరే ఏడెనిమిది సార్లు తినాలి. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకూడదు.