డైట్ సమయంలో ఈ పళ్ళు తినండి..

ఇప్పుడు అంతా ఫిట్ నెస్ కి ప్రాధాన్యం ఇస్తున్నారు. దానిలో భాగంగా డైట్ ప్లాన్స్ కూడా తీసుకుంటున్నారు. మరి డైట్ టైంలో ఏం ఏం తినాలో తెలుసుకుందాం. పండ్లు ఆరోగ్యానికి మేలు.. ముఖ్యంగా చాలా మంది బరువు తగ్గడానికి డైట్ చేస్తున్న సమయంలో ఎక్కువగా పండ్లు తింటూ.. మిగతా ఆహారాన్ని తగ్గిస్తారు. అన్నం, టిఫిన్ తగ్గించి పండ్లు తినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే డైట్ లో ఉన్న సమయంలో కొన్ని పండ్లు తింటే బరువు తగ్గడం మాట అటుంచి మరింత బరువు పెరుగుతాం.. అందుకనే తప్పని సరిగా బరువు తగ్గాలనుకునే వారు డైటింగ్ లో ఉన్నసమయంలో ఈ పండ్లు తినకూడదు..అన్ని సీజన్లలో లభిస్తాయి,ఆ అంతేకాదు పండ్లలో అన్నిటికంటే చౌకగా దొరికేవి అరటిపండ్లు. అయితే ఈ అరటిపండ్లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడం కోసం డైట్ చేసేవారు ఆకలి వేయదని ప్రతిరోజూ 2 నుండి 3 అరటి పళ్ళు తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు.పండ్లలో రారాజు మామిడి పండ్లు. వేసవిలో లభించే మామిడి పండ్లను ఇష్టపడేవారు ఉండరు. అయితే డైట్ లో ఉన్నవారు మాత్రం ఈ పండును తినకూడదట..ఒక కప్పు మామిడి పండులో లో కేలరీలు 99 ఉంటాయి కనుక బరువు తగ్గాలని అనుకునేవారు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి.వీటిల్లో ఎక్కువ కేలరీలు, అధికంగా చక్కెర శాతం ఉంటాయి. దీంతో వీటిని రోజూ తింటే బరువు పెరిగేలా చేస్తుంది.అవకాడో లో కూడా అధిక కేలరీలతో పాటు.. ఆరోగ్యకరమైన ఫ్యాట్ కూడా ఉంటుంది. 100 గ్రాముల అవకాడో లో 160 కేలరీలు ఉంటాయి. అందుకని వీటిని అప్పుడప్పుడు తీసుకోవాలి కానీ డైట్ లో ఉన్నవారు రోజూ తింటే బరువు పెరగటం ఖాయం.డైట్ లో ఉన్నవారు ఎండు ద్రాక్షను దూరం పెట్టడం మంచిది. ఒక కప్పు ఎండుద్రాక్ష 500 కేలరీల ను కలిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా బరువు పెరిగేలా చేస్తుంది. అందువల్ల, డైటింగ్ చేసేటప్పుడు ఎండుద్రాక్ష కు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *