తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త చైర్మన్ తో పాటు సభ్యును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఛైర్మన్ గా ప్రస్తుత వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి (ఐఏఎస్ అధికారి) నియమితులయ్యారు. సభ్యులుగా రిటైర్డ్ ఈఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ లింగారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారి, ప్రొఫెసర్ సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద డాక్టర్ అవరెల్లి చంద్రశేఖర్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణమూర్తి, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. మరోవైపు నాలుగు వారాల్లోపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల టీఎస్ హైకోర్టు ఆదేశించింది. దీనికి తోడు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. వీటన్నిటి నేపథ్యంలో చైర్మన్, సభ్యులను నియమించింది.