నిద్ర లేకపోతే..రోగ నిరోధక శక్తి దెబ్బ తీస్తుందట..

లైఫ్ లో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది కరోనా..ముఖ్యంగా ఆహారం విషయంలో పలు మార్పులు వచ్చాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పండ్లు తీసుకోవడం.. పురాతన వంటకాలను తినడం.. కఠినమైన వ్యాయమాలు చేయడం లేదా.. ఇంట్లో చేసిన కషాయాలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం తీసుకునే ఆహారం వలన మాత్రమే కాకుండా.. మనం రోజూ వారీ చేసే పనులపై కూడా రోగ నిరోధక శక్తి ఆధారపడి ఉంటుందంట. ఇటీవల ప్రముఖ డైటీషియన్ మాన్సీ పడేచియా.. తన ఇన్‏స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసుకున్నారు. శరీరం చాలాసార్లు బలమైన రోగ నిరోధక శక్తిని చూపిస్తుంది. శరీరానికి ఎక్కువగా శ్రమ కల్పించినప్పుడు రోగ నిరోధక శక్తిపై ఆధారపడుతుంది. జలుబు, ఫ్లూ నుంచి కోలుకున్నప్పుడు రోగ నిరోధక శక్తి సామార్థ్యం గురించి తెలుస్తోంది. అయితే మనం రోజూ వారీ జీవన శైలిలో చేసే కొన్ని మార్పుల వలన రోగ నిరోధక శక్తి తగ్గిపోయి.. బలహీనంగా మారే అవకాశాలు ఉంటాయి.శరీరం రోగ నిరోధక పనితీరుకు సహాయపడే ఒక రకమైన ప్రోటీన్ సైటోకిన్‌లను విడుదల చేస్తుంది. కానీ ఇది నిద్రలో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కాబట్టి నిద్ర లేకపోవడం అనేది మీ రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది.ఒత్తిడి హార్మోన్ కార్టికోస్టెరాయిడ్ లింఫోసైట్ల సంఖ్యను తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ ప్రభావాన్ని తగ్గిస్తుంది.గింజలు.. విత్తనాలు, జింక్, బీటా కెరోటిన్, విటమిన్స్ ఎ, సీ, ఇ, ఇతర పోషకాలను తెల్ల రక్త కణాలు లేదా డబ్ల్యూబీసీల సృష్టికి సహయపడతాయి.విటమిన్ డి గ్రాహకాలు అనేక రకాల రోగనిరోధక కణాలపై ఉన్నాయి. అంటువ్యాధులను అరికట్టడానికి చురుకుగా పనిచేస్తాయి.ఏరోబిక్ వ్యాయామాలు శరీరంలో రక్తం మరింత సమర్థవంతంగా రావడానికి సహాయపడతాయి. అనగా సూక్ష్మక్రిమితో పోరాడే పదార్థాలు అందుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *