నీటి ద్వారా కరోనా సోకదన్న ప్రొఫెసర్ సతీశ్ టారె..

పలువురు నదుల్లో కరోనా మృతదేహాలను నిర్థాక్ష్యంగా నదుల్లో పడేస్తున్నారు. మరి ఆ నీటి ద్వారా కరోనా వేరొకరికి సోకే ప్రమాదం ఉందా..అంటే లేదని చెబుతున్నారు  ప్రొఫెసర్ సతీశ్.దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కాటుకు ప్రతి రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానాలు ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శవాలను నదుల్లోనే పడేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరాదిన గంగా, యమున నదుల్లో నీటిపై శవాలు తేలుతున్న పరిస్థితి దేశ వ్యాప్తంగా ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ శవాల వల్ల నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా  అనే ఆందోళన జనాలను బెంబేలెత్తిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఐఐటీ కాన్పూర్ కు చెందిన పర్యావరణ ప్రొఫెసర్ సతీశ్ టారె క్లారిటీ ఇచ్చారు. కరోనా మృతదేహాలను నదుల్లో పడేయడం వల్ల, ఆ నీటిని తాగితే కరోనా సోకుతుందనే ఆందోళన అక్కర్లేదని ప్రొఫెసర్ సతీశ్ చెప్పారు. నదీ జలాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే వాటిని ప్రజా అవసరాలకు సరఫరా చేస్తారని తెలిపారు. శుద్ధి చేసే ప్రక్రియలో వైరస్ చనిపోతుందని చెప్పారు. అయితే, నదుల్లోని నీటిని నేరుగా తాగేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *