నేరేడు పండుని అందరూ తినకూడదట..

షుగర్ వ్యాధి గ్రస్తులకు నేరేడు పండు చక్కని ఔషధమని చెప్పాలి. మరి ఈ నేరేడు పండ్లు అందరూ తినొచ్చా.. అంటే తినకూడదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలున్నవారికి ఈ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి లేదా క్యాన్సర్ వ్యాధి నివారణకు చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా రకాల వ్యాధులకు చక్కటి ఔషధంకూడా. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఔషధ లక్షణాల ఆధారంగా దీనిని ఆయుర్వేదం, హోమియోపతిలలో కూడా ఉపయోగిస్తున్నారు. కానీ అధిక వినియోగం వల్ల చాలా అనర్థాలు కూడా ఉన్నాయి. ఖాళీ కడుపుతో లేదా పాలు తాగిన తరువాత తినకూడదు. నేరేడు పెద్ద మొత్తంలో తినడం వల్ల జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్య వస్తుంది.నేరేడు శరీరంలో వాత దోషాన్ని తీవ్రతరం చేస్తుంది. అధిక స్థాయిలో వాతం ఉన్నవారు ఈ పండు తినకుండా ఉండటమే మేలు.నేరేడు అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా నేరేడు తినకూడదు.నేరేడు పండు తీసుకోవడం వల్ల సహజంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. కనుక శస్త్రచికిత్సకు ముందు లేదా వీటిని తినడం మానుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *