పచ్చికొబ్బరితో పలు రోగాలకి చెక్..

కొబ్బరి అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఈ కొబ్బరి వాడకం అనేది కేరళలో అధికంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది కొబ్బ‌రి బొండాల్లోని నీరును తాగిన త‌ర్వాత చాలా మంది లోప‌లి కొబ్బరిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అలాగే దేవాల‌యాల్లో కొబ్బ‌రి కాయ కొట్టిన త‌ర్వాత లోప‌లి కొబ్బ‌రిని తిన‌డానికి ఆస‌క్తి చూపించ‌కుండా నిర్ల‌క్ష్యం చేస్తుంటారు. అయితే ప‌చ్చి కొబ్బ‌రితో క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే మాత్రం ఇక‌పై ఎట్టి ప‌రిస్థితుల్లో కొబ్బ‌రిని తిన‌కుండా ఉండ‌లేరు. ఇంత‌కీ ప‌చ్చి కొబ్బ‌రి వ‌ల్ల కలిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి అది ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. కొబ్బ‌రిలో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గొంతు, బ్రాంకైటిస్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కొబ్బ‌రిని క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో వ‌చ్చే అల్జీమ‌ర్స్ వంటి వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అంతేకాకుండా మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ కొబ్బ‌రి కీల‌క‌పాత్ర పోషిస్తుంది.కొబ్బ‌రిలో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. ఇక కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ సాఫీగా ఉంటుంది. పేగుల్లో క‌ద‌లిక‌లు బాగుంటాయి. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.పొడి చ‌ర్మం, వెంట్రుక‌లు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోన్న‌వారికి కొబ్బ‌రి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. చ‌ర్మంలో తేమ‌ను పెంచ‌డంలో కూడా కొబ్బ‌రి కీల‌క పాత్ర పోషిస్తుంది. దీంతో చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగుప‌డుతుంది. కొబ్బ‌రిలో ఉండే మోనోలారిన్‌, లారిక్‌ యాసిడ్‌లు యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి.ప‌చ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *