పాదాల పగుళ్ళు పోగొట్టండి ఇలా..!

చాలామందికి పాదాలు పగులుతు ఉంటాయి..ఈ వర్షాకాలంలో పాదాల పగుళ్ళు ఉంటే ప్రమాదమనే చెప్పాలి..మరి ఆ పాదాల పగుళ్ళు పోవాలంటే ఏం చేయాలో చూద్దాం.. అరటిపండు న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. రెండు అరటిపండ్లను మెత్తగా చేసి పాదాలకు రాయాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. రెండు వారాల పాటు ఇలా చేస్తే పగుళ్లు తగ్గిపోతాయి.ఒక టబ్‌లో కొన్ని గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో ఒక కప్పు తేనె వేయాలి. అందులో పాదాలు పెట్టి ఇరవై నిమిషాల పాటు నెమ్మదిగా పాదాలపై మర్దన చేయాలి. తరువాత పాదాలను పొడిగుడ్డతో తుడిచి మాయిశ్చర్‌ రాసుకోవాలి. గోరువెచ్చని నీటిలో పావుగంటపాటు పాదాలను పెట్టి తరువాత పొడిగుడ్డతో తడుచుకోవాలి. తరువాత ఒక టీస్పూన్‌ వ్యాజిలైన్‌లో నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి పాదాలకు రాసుకుని సాక్స్‌ ధరించి పడుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు దూరమవుతాయి.పాదాలను గోరువెచ్చటి నీళ్లలో పదినిమిషాలు పెట్టాలి. తరువాత రెండు టేబుల్‌స్పూన్ల బియ్యప్పిండి, ఒక టీస్పూన్‌ తేనె, నాలుగైదు చుక్కల వెనిగర్‌ను పేస్టులా చేసి పగుళ్లు ఉన్న చోట స్క్రబ్‌ చేయాలి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *