పుదీనాతో ఆరోగ్యం..

పుదీనా అదేనండీ మింట్ ఈ ప్లేవర్ పలువురికి నచ్చదు. కానీ ఈ పుదీనాతో ఆరోగ్యానికి ఎంతో మేలట. మరి ఆ సంగతులు చూద్దాం. పుదీనా మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ ర‌కాల మాంసాహార‌, శాఖాహార వంట‌కాల్లో వినియోగిస్తాం. వంట‌ల్లోనేగాక టీ లు, సలాడ్స్‌, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతాం. పుదీనాను జోడించ‌డం ద్వారా వివిధ ర‌కాల పదార్థాలకు చక్కని వాసన, రుచి కూడా వ‌స్తుంది. అంతేగాక‌ ఇది తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. వేసవిలో పుదీనాను ఎక్కువగా వినియోగించడం ఆరోగ్యానికి మంచిది. గుప్పెడు పుదీనా ఆకుల్లో ఒక‌రోజు మొత్తానికి కావాల్సిన‌ విటమిన్‌-ఎ లో పది శాతం లభిస్తుంది. అజీర్తి, గ్యాస్‌ సమస్యలను ఎదుర్కోవడానికి కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా పుదీనా వేసి, కాచిన నీళ్లు తీసుకుంటే అది మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. తరచూ పుదీనా ఆకులు నమలడంవల్ల నోటి దుర్వాసనను కూడా దూరం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *