ఫేస్ ఫ్యాట్..తగ్గించడం ఎలా..!

ఫ్యాట్ అంటే కేవలం బాడీకే కాదు..ఫేస్ కి కూడా ఫ్యాట్ వస్తుందని తెలుసా..మరి ఆ ఫ్యాట్ ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.. రెండేండ్లుగా చాలామంది వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారు. పని గంటలు కూడా ఎక్కువగా ఉండటంవల్ల.. గంటల తరబడి కదలకుండా కూర్చోవాల్సి వస్తున్నది. జిమ్‌లు, పార్కులు మూతపడటంతో శారీరక వ్యాయామం తగ్గింది. కొవ్వు సమస్య మొదలైంది. అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు. శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు సెల్ఫీల్లో కనిపించకపోవచ్చు. కానీ ఫేషియల్‌ ఫ్యాట్‌ మాత్రం వీడియో కాల్స్‌లో, సెల్ఫీలలో.. కొలీగ్స్‌కు, ఫ్రెండ్స్‌కు ఇట్టే కనిపిస్తుంది. ఇలా చుబుకం దగ్గర, బుగ్గల మీద పేరుకుపోతున్న కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని రకాల వ్యాయామాలను సూచిస్తున్నారు ఫిట్‌నెస్‌ కోచ్‌లు..ముఖం కోలగా తయారయ్యేందుకు పనికొచ్చే వ్యాయామం.. చిన్‌ పుల్‌. ముందుగా, నేలపై అనుకూలంగా కూర్చోవాలి. తర్వాత గడ్డాన్ని సీలింగ్‌ వైపుగా.. అంటే, పైకి లాగేందుకు ప్రయత్నించాలి. అలా చేస్తే నరాలు సాగినట్లయి, గడ్డం దగ్గర టోనింగ్‌ జరుగుతుంది.ఇది చాలా సులభం. రోజూ మేకప్‌ వేసుకోవడానికి ముందు ఐదు సెకన్ల పాటు నాలుగుసార్లు చెంపలను లోపలికి లాగినట్లు చేసి చేప నోటిలా పెట్టాలి. అలాగే అద్దం ముందు కూర్చున్నప్పుడు వీలైనన్నిసార్లు నవ్వుతూ ఉండాలి. ఈ ప్రక్రియలు ఫేషియల్‌ ఫ్యాట్‌ని తగ్గించడమే కాదు, మనలో ఆత్మస్థయిర్యాన్ని పెంచుతాయి.ఫేషియల్‌ ఫ్యాట్‌ తగ్గాలంటే అరచేతిని పిడికిలిలా బిగించి, దాన్ని గడ్డం కింద పెట్టాలి. చేయి అలానే పెట్టి తలను పైకి ఎత్తాలి. కొన్ని సెకన్లపాటు ఆ భంగిమలో ఉంచాలి. ఇలా రోజుకు ఐదారుసార్లు చేయాలి.కూర్చునప్పుడు వీపు, భుజాలను నిటారుగా పెట్టి తలను మాత్రం ముందుకు, ఇరువైపులా తిప్పుతూ కొన్ని సెకన్లు ఉంచాలి. ఇలా చేస్తే గడ్డం దగ్గర కొవ్వు కరగడంతో పాటు మెడ కండరాలు దృఢంగా మారుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *