రేగు పళ్లలో పోషకాలు..

మీకు రేగు పండ్ల గురించి తెలుసుగా..చిన్నగా పుల్లగా..తియ్యగా ఉంటాయి. రేగు పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు లున్నాయి. రేగు పండ్లు తినడం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది.వీటిలో కాల్షియం ఎక్కువుగా ఉండడం వల్ల ఎముకలు బలిష్టంగా మారుతాయి. వీటిలో పొటాషియం, జింక్, మాంగనీస్, పాస్ఫరస్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ సీజనల్ పండును తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి. రేగు పండ్లు రక్తహీనత నుంచి మనల్ని కాపాడతాయి. వీటిలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేలా రేగు పండ్లు చేస్తాయి. కాబట్టి వీటిని తప్పకుండ తినాలి. వీటిలో చక్కర స్థాయిలను తగ్గించే శక్తి ఉండడం వల్ల షుగర్ ఉన్న వారికీ కూడా చాలా మంచిది. ఇవి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. రేగు పండు పేస్ట్ ను గాయాలకు రాయడం వల్ల గాయాలు తొందరగా తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచి ఆకలిని తగ్గిస్తుంది. వీటిని ఎం,ముక్కలుగా చేసి తేనెలో నానబెట్టుకుని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు రేగు పండ్లను తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *