విటమిన్ డి వల్ల లాభాలేంటి..

కరోనా పుణ్యమా అని అందరూ మంచి ఫుడ్ వైపు మళ్ళారు. మంచి ఫుడ్..విటమిన్స్..మినిరల్స్ ఉండే ఫుడ్ నే ఫ్రిఫర్ చేస్తున్నారు. జంక్ ఫుడ్… ఆయిల్ ఫుడ్ తినడం మానేసి.. ఇప్పుడు అందరూ.. రోగ నిరోధక శక్తిని పెంచే సహజ కూరగాయలు పండ్లు ఎక్కువగా తింటున్నారు. విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాదాన్యత ఇస్తున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారం కోవిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.విటమిన్ డి కొవ్వులో కరిగే పోషకం. ఇది శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే కరోనాను కట్టడికి ఇప్పుడు దేశం మొత్తం టీకా పంపిణీ చేస్తున్న క్రమంలో.. కోవిడ్ కి కారణమయ్యే.. Sars-CoV-2 అనే వైరస్ మరింత వ్యాపించకుండా ఉండేందుకు ఈ విటమిన్ డి సహయపడుతుందని.. ఇటీవల పలు అధ్యాయనాల్లో బయటపడింది. అంతేకాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను కూడా నివారించడంలో ఈ విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది.చికాగో మెడిసిన్ విశ్వ విధ్యాయంలో డాక్టర్ డేవిడ్ మెల్టర్జ్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం విటమిన్ డి లోపం ఉన్నవారికి… విటమిన్ డి పుష్కలంగా ఉన్నవారితో పోలిస్తే.. కరోనా సోకే ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 489 మంది రోగులలో కోవిడ్ కు పాజిటివ్ పరీక్షించే ప్రమాదం విటమిన్ డి లోపం ఉన్నవారికి 1.77 రెట్లు ఎక్కువ అని తేలింది. మెల్టర్జ్ మాట్లాడుతూ.. ఆహారంలో తగినంత విటమిన్ డి ఉండడంవలన కరోనా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం తక్కువగా ఉందని చెప్పారు. మాస్కులు ధరించడం.. ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించడం తర్వాత.. అవసరమైన సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.దాదాపు పరిశోధన అధ్యయనాల ప్రకారం.. రోజూ విటమిన్ డి పదార్థాలను తీసుకోవడం వలన కరోనా వలన ఏర్పడే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తుంది. అయితే ఇతర అధ్యయనాలు.. కాల్విఫెడియోల్ ప్రకారం విటమిన్ డి ఎక్కువగా ఉండే కరోనా రోగులకు ఐసీయూ వరకు వెళ్లే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. అంతేకాకుండా.. విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది. సాల్మన్, ఇతర కొవ్వు చేపలు, గుడ్డు సొనలు, పుట్టగొడగులు, పాలు వంటి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఎక్కువగా సూర్య రశ్మి తగడం కూడా మంచిదే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *