వ్యాక్సినేషన్ ముందు..తర్వాత..

కరోనాకి విరుగుడుగా ఇప్పుడంతా వ్యాక్సిన్ ని వేయించుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకునే వారిలో కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ వేయించుకునే ముందు..తర్వాత ఏం చేయాలో తెలుసుకుందామా.. వ్యాక్సినేష‌న్‌కు ముందు, ఆ త‌ర్వాత శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే వ్యాక్సినేషన్ టైంలో వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.  టీకా వేయించుకునే కొన్ని రోజుల ముందు పసుపు, వెల్లుల్లి, అల్లం, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలని.. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బ్లూ బెర్రీస్, చికెన్/వెజిటబుల్ సూప్, డార్క్ చాక్లెట్, ఆలివ్ నూనె, బ్రకోలిని డైట్‌ ప్లాన్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు. కాగా, ధూమపానం, మద్యపానం, ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ వేయించుకోవడం, కెఫిన్‌ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం లాంటివి వ్యాక్సినేషన్ సమయంలో అస్సలు చేయకూడదని హెచ్చరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *