వ్యాక్సిన్ వేయించుకున్నా ఆ మందులు వాడొచ్చట..
కరోనా వ్యాక్సిన్ ఇది మాత్రమే కరోనాని తగ్గించగలదని నమ్ముతున్నారు అంతా. ప్రస్తుత పరిస్థితుల్లో వేరే దారి కూడా లేదు మరి. అయితే ఈ వ్యాక్సిన్ గురించి తోచిన రీతిలో అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ పలు అపోహలకు కారణమవుతున్నారు పలువురు. ఏ వ్యాధులు ఉన్నవాళ్లయినా, ఎలాంటి మందులు వేసుకుంటున్న వారైనా నిరభ్యంతరంగా టీకా తీసుకోవచ్చునని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు పలువురు వైద్య నిపుణులు.నిరభ్యంతరంగా ఈ వ్యాక్సిన్ ను ఎవరైనా వేయించుకోవచ్చని తెలిపారు. గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్లకు కరోనా వల్ల తీవ్ర సమస్యలు వస్తాయి. కాబట్టి, వారు వీలైనంత త్వరగా టీకా వేసుకోవాలి. సాధారణంగా గుండె రుగ్మతలు ఉన్నవాళ్లు వాడే మందులు రక్తం పలుచబడేలా చేస్తాయి. అయితే, ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు మినహా మిగతావారు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి అనుమానాలూ లేకుండా వ్యాక్సిన్ ని తీసుకోవాల్సిందే. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా డయాబెటిస్, బీపీ పేషెంట్లు మందులను ఆపాల్సిన పన్లేదట.