షుగర్ ఫ్రీ మ్యాంగోస్..ఎక్కడో తెలుసా..

మామిడిపండ్లని ఇష్టపడని వారు ఉంటారా. కానీ డయాబెటిక్ పేషెంట్స్ వీటికి దూరంగా ఉంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇకపై షుగర్ ఫ్రీ మామిడిపండ్లు మీకోసమేనట. వివరాల్లోకి వెళ్తే ఈ సీజన్‌లో విరివిగా దొరికే నోరూరించే మామిడి పండ్లను తినాలని ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. వాటిని తింటే షుగర్‌ లెవల్స్‌ పెరిగే ప్రమాదముండటంతో డయాబెటిక్‌ పేషెంట్స్‌ వాటిని తినడానికి భయపడుతారు. కానీ ఇకనుంచి ఆ భయం అక్కర్లేదు. పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తి షుగర్‌ ఫ్రీ మామిడి పండ్లను పండించాడు. సొనారో, గ్లెన్‌, కీట్‌.. అనే మూడు వెరైటీలలో లభ్యమయ్యే ఈ పండ్లను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో పండించినట్టు పాకిస్థాన్‌లోని సింధ్‌ రాష్ర్టానికి చెందిన మామిడి పండ్ల నిపుణుడు గులామ్‌ సర్వార్‌ తెలిపారు. ఆయన మేనమామ ఎంహెచ్‌ పన్హర్‌ దీనికి శ్రీకారం చుట్టగా, ఆయన మరణానంతరం సర్వార్‌ దానిని పూర్తి చేశాడు. వారికి ఉన్న 300 ఎకరాల భూమిలో వీటిని పండించినట్టు చెప్పాడు. సొనరో, గ్లెన్‌లో చక్కెర స్థాయిలు 5.6 కంటే తక్కువగా ఉన్నాయని, కీట్‌లో అతి తక్కువగా 4.7 చక్కెర స్థాయిలు ఉన్నాయని వివరించారు. వీటిని ప్రత్యేకించి మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసమే తయారుచేసినట్టు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ మార్కెట్లలో లభ్యమవుతున్న వీటి ధర కిలోకు రూ.150 గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *