హార్ట్ ఎటాక్.. ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్..
ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో హార్ట్ ఎటాక్ తో చనిపోయిన కేసులు కూడా ఎక్కువనే చెప్పాలి. గుండె చాలా ఇంపార్టెంట్ మనిషులకే కాదు,,ఏ జీవికి అయినా సరే. అందువల్ల ప్రతి ఒక్కరూ గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే క్రమంగా మరణానికి చేరువ అవుతున్నట్లేనని ఆరోగ్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. సాధారణంగా గుండెకు రక్తం సరఫరాలో ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గుండె నొప్పి వస్తుందని వారు చెబుతున్నారు. మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్చగలుగుతున్నారని, అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు. సాధారణంగా ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని, మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారని తెలిపారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, నిత్య వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, పొగాకు ఉత్పత్తులను దూరం పెట్టడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.