ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు..

అసలే కరోనా టైం..ఇలాంటి సమయాల్లో స్వచ్ఛమైన గాలి దొరకాలంటే సాధ్యమయ్యే పనేనా. సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే. దీంతో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్‌ ( Oxygen ) దొరికేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువగా ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. ఇండ్లమీద, బాల్కనీ, గోడలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సెకండ్‌ వేవ్‌ ( Second wave ) లో కరోనా విజృంభించి ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు. ఇలా కొవిడ్‌ ( COVID-19) నేర్పిన పాఠంతో ఎయిర్‌ ప్యూరిఫై మొక్కల ( air purifier plants ) పెంపకంపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసేందుకు నర్సరీల వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీ నిర్వాహకులు సైతం అనేక మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రూ.50 నుంచి రూ.500ల వరకు అమ్ముతున్నారు.సాధారణంగా మొక్కలన్నీ గాలిలోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. అలాంటప్పుడు కొత్తగా ఆక్సిజన్‌ మొక్కలంటే ఏమిటనే సందేహం రావచ్చు.కానీ అన్ని మొక్కలు ఒకేస్థాయి, ఒకే విధంగా శ్వాసక్రియను జరపవు. అదేవిధంగా ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌, రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. అదీగాక అవి విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ. కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి. వీటినే పర్యావరణ ప్రేమికులు, బయాలజిస్టులు ఆక్సిజన్‌ మొక్కలుగా పిలుస్తుంటారు. వాటిలో కొన్ని మీ కోసం..వీపింగ్‌ ఫిగ్‌ ..మనీప్లాంట్‌..స్పైడర్‌ ప్లాంట్‌..అరెకా ఫామ్‌..అరెకా ఫామ్‌..స్నేక్‌ ప్లాంట్‌..తులసి..ఏడాది కాలంగా ఆక్సిజన్‌ మొక్కలకు డిమాండ్‌ పెరిగింది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుతం 50 శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. ఎయిర్‌ ప్యూరిఫైయర్లుగా కాకుండానే ఇంటి అలంకరణకు ఈ మొక్కలు ఎంతో ప్రసిద్ధి. అదీగాక వీటి సంరక్షణ ఎంతో సులువు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *