8కేజీల బీట్ రూట్..ఎక్కడో తెలుసా..
బీట్ రూట్ అంటే ఎంత సైజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఏకంగా 8కేజీల బీట్ రూట్ పెరిగిందట. మరి అది ఎక్కడో తెలుసుకుందాం. ఒమన్‌లోని మనా టౌన్‌కు చెందిన ఖలీత్ బిన్ హిలాల్ అనే వ్యక్తి వార్తల్లో నిలిచాడు. ఖలీత్ ఆరు నెలల క్రితం తన పొలంలో బీట్రూట్ పంటను వేశాడు. పంట మొత్తం సాధారణ బరువు, సైజులోనే పండినప్పటికి.. ఒకే ఒక్క బీట్రూట్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా పండింది. ఆ బీట్రూట్ బరువు ఏకంగా 8 కేజీలుగా ఉంది. దీంతో ఆ బీట్రూట్ను చూసేందుకు చుట్టుపక్కల వారు ఖలీత్ ఇంటికి తరలి వస్తున్నారు. ఈ బీట్రూట్ ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఒమన్ ప్రభుత్వం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడుతుండటం వల్ల దేశంలో వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. వ్యవసాయ, మత్స్య, జల వనరుల శాఖ రైతులకు అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులలో దేశాన్ని స్వయం సమృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఆహార భద్రతను పెంచేందుకు, రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది.